Begin typing your search above and press return to search.
జగన్ సొంత జిల్లా కడప గడపలో ఇళ్లకు తాళం.. రీజనేంటి?
By: Tupaki Desk | 13 Jan 2023 3:49 AM GMTఏపీ సీఎం జగన్ సొంత జిల్లా.. ఆమాటకొస్తే.. వైఎస్ కుటుంబానికి పెట్టని కోట వంటి జిల్లా కడప. మరి అలాంటి జిల్లాలో వైసీపీ పాలనపై ప్రజలు హ్యాపీగానే ఉంటారని అందరూ అనుకుంటారు. అంతేకాదు.. వైసీపీ నేతలు వెళ్తే.. ప్రజలు ఎదురొచ్చి మరీ హారతులు పడతారని కూడా భావిస్తారు.
ఎందుకంటే.. తమకు నచ్చిన నాయకుడు.. తాము మెచ్చిన నేత జగన్ పాలన చేస్తున్నారు కాబట్టి. అయితే.. ఇలాగే జరిగి ఉంటే.. ఇప్పుడు ఈ జిల్లా వార్తల్లోకి వచ్చేది కాదు.
ఎందుకంటే.. ఇక్కడ పూర్తిగా రివర్స్‌లో జరిగింది. కడప జిల్లాలోని మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డికి నిరసన సెగ తగిలింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయనపాల్గొన్నారు.
తన నియోజకవర్గం పరిధిలోని నర్శిరెడ్డిపల్లెలో 'గడపగడప` లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అయితే.. ఆయన వస్తున్నారని తెలిసి.. ఈ గ్రామంలోని ప్రజలు తీవ్ర నిరసన తెలిపారు.
గ్రామంలోని 420 ఇళ్ల వాళ్లు కూడా తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. అయితే.. విషయం ఎమ్మెల్యేకు తెలియజేసేందుకు ఒకరిద్దరు గ్రామ పెద్దలు మాత్రం అక్కడ ఉన్నారు. తమకు కనీసం.. రోడ్లు కూడా వేయడం లేదని, అర్హులైన వారికి కూడా పింఛన్లు ఇవ్వడం లేదని.. అందుకే గ్రామస్తులు ఆగ్రహంతో ఉన్నారని.. గ్రామ పెద్దలు స్పష్టం చేశారు.
దీంతో చేసేదేమీ లేక గ్రామం నుంచి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వెనుతిరిగారు. నర్శిరెడ్డిపల్లెలోకి రోడ్డువేస్తామన్న హామీని ఎమ్మెల్యే అమలుచేయలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ ఘటనతో జగన్ సొంత జిల్లా కడపలోనే వైసీపీ పాలనపై సెగలు పుడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.