Begin typing your search above and press return to search.

సీఎం జిల్లాలోని ఆ మున్సిపాలిటీని సెట్ చేయలేకపోతున్నారా?

By:  Tupaki Desk   |   2 Aug 2021 1:30 PM GMT
సీఎం జిల్లాలోని ఆ మున్సిపాలిటీని సెట్ చేయలేకపోతున్నారా?
X
అరచేతిలో అధికారం ఉంటే ఏమైనా చేస్తామన్నట్లుగా ఉంటున్నాయి అధికారపక్షాల తీరు. ఆ మాటకు వస్తే ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లుగా ప్రతిపక్షాలు అదే పనిగా విరుచుకుపడుతుంటాయి. అయితే.. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో తాము అనుకున్నట్లుగా చేయలేకపోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. కడప జిల్లాలో అధికారపక్షానికే ఎదురే లేదని.. అధికారపార్టీకి విపక్షానికి మధ్య దూరం కొలవలేనంతగా ఉంటుందన్న మాట వినిపిస్తుంటుంది. అయితే.. మైదకూరు మున్సిపల్ రెండో వైస్ ఛైర్మన్ ఎంపిక మాత్రం దీనికి మినహాయింపుగా చెబుతారు.

అయితే.. ఈ ఆరోపణలో ఏ మాత్రం నిజం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. విపక్షాలు మాత్రం అందుకు భిన్నమైన వాదనల్ని వినిపిస్తూ ఉంటుంది. అసలేం జరిగిందన్నది చూస్తే.. ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి.. కడప జిల్లాలోని మైదకూరు మినహా మిగిలిన అన్నిచోట్ల చతికిల పడటం.. దారుణ పరాభవాల్ని మూటకట్టుకోవటం తెలిసిందే. తాడిపత్రి క్రెడిట్ మొత్తం జేసీ బ్రదర్స్ పుణ్యమేనని చెప్పక తప్పదు.

ఇక.. మైదకూరు విషయానికి వస్తే.. ఈ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉంటే.. టీడీపీ 12 వార్డుల్లో.. వైసీపీ 11 వార్డుల్లో విజయం సాధించగా.. జనసేన ఒక స్థానంలో గెలుపొందింది. దీంతో.. మెజార్టీ ఏ పార్టీకి లేనప్పటికి అధికార వైసీపీకీ ఉన్న ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యుల పుణ్యమా అని ఆ పార్టీకి కలిసి వచ్చింది. ఛైర్మన్ పదవిని దక్కించుకుంది. బలాన్ని 13కు పెంచుకున్న వైసీపీకి అనుకూలంగా టీడీపీ ఆరో వార్డు కౌన్సిలర్.. జనసేన కౌన్సిలర్ కూడా హాజరు కాకపోవటంతో ఛైర్మన్ ఎంపిక వైసీపీ అనుకున్నట్లే జరిగింది. ఛైర్మన్ గా మాచనూరి చంద్ర.. వైస్ ఛైర్మన్ గా మహబూబ్ షరీఫ్ ఎంపికయ్యారు. రెండో వైస్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకోవటానికి మాత్రం వైసీపీ సాధ్యం కావట్లలేదన్న మాట వినిపిస్తోంది.

అయితే.. రెండో వైస్ ఛైర్మన్ పదవిని ఎవరికి ఇవ్వాలన్న దానిపై పార్టీలో తర్జన భర్జన జరగటం.. అంతలోనే ఎమ్మెల్యే ఆరోగ్యం బాగోలేకపోవటంతో ఈ ఎంపిక ప్రక్రియ ఆలస్యమవుతుందని చెబుతున్నారు. ఎంత ఎమ్మెల్యే ఆరోగ్యం బాగోకుంటే.. ఇంత ఆలస్యమా? అని పెదవి విరుస్తున్నారు.రాష్ట్రంలో పవర్ లో ఉండి.. సంఖ్యా పరంగా చూసినప్పుడు అధిక్యత ఉండి కూడా రెండో వైస్ ఛైర్మన్ పదవిని భర్తీ చేయటంలో ఇంత ఆలస్యమా? అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మరీ.. విషయాన్ని అధిష్ఠానం సీరియస్ గా ఎప్పుడు తీసుకుంటుందో?