Begin typing your search above and press return to search.
రైల్వే బడ్జెట్ లో తెలుగోళ్ల మాటకు విలువ
By: Tupaki Desk | 27 Feb 2016 9:13 AM GMTమీరిచ్చిన ఒక ఐడియా... ఒక సూచన... ప్రభుత్వానికి నచ్చి దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి తీసుకుంటే ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది కదా!! మొన్నటి రైల్వే బడ్జెట్ సందర్భంగా దేశంలో చాలామందికి అలాంటి ఆనందమే కలిగింది. వారు చేసిన సూచనలు స్వీకరించి కేంద్రం ప్రభుత్వం వాటిని రైల్వే బడ్జెట్ లో పెట్టింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సూచనలకూ కేంద్ర బడ్జెట్ లో చోటు దక్కడం విశేషం.
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పౌరుల భాగస్వామ్యం అవసరం అన్న ఉద్దేశంతో ఎన్డీయే ప్రభుత్వం వివిధ అంశాలపై ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది. మైగవర్నమెంట్ అనే బ్లాగు ఆధారంగా వివిధ అంశాలపై ప్రజల సూచనలు స్వీకరిస్తోంది. అందులోభాగంగానే రైల్వేబడ్జెట్ తయారీకి ముందు ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది తెలుసుకుంది. చాలామంది స్పందించి ఎన్నో సూచనలు చేశారు. వాటిలో కొన్నిటిని ఎంపిక చేసి రైల్వేబడ్జెట్ లో వాటిని ప్రకటించారు. అలాంటివి కొన్ని...
- చైనా వంటి దేశాల్లో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మన రైల్వేల్లో అమలు చేయాలని విశాఖపట్నానికి చెందిన వెంకటి అనే వ్యక్తి సూచించారు. కేంద్రానికి ఇది నచ్చి... అంతర్జాతీయంగా ఉన్న టెక్నాలజీని అధ్యయనం చేసి రైల్వేల నిర్వహణ, పర్యవేక్షణలో ఉపయోగించుకుంటాం అని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు.
- గ్యాంగ్ మేన్ల వద్ద ఉన్న భారీ టూల్ కిట్ల వల్ల వారు ఇబ్బంది పడుతున్నారని... ఆ భారం తగ్గించడమో, లేదంటే కొత్త పద్ధతులతో ఆ బరువైన టూల్ కిట్ల అవసరం లేకుండా చేయాలని హైదరాబాద్ కు చెందిన జానా బాషా షేక్ సూచించారు.
సరికొత్త ఇంజినీరింగ్ విధానాలు, లేటెస్ట్ పరికరాలు తీసుకొచ్చి గ్యాంగ్ మెన్ల కష్టాలు తప్పిస్తామని బడ్జెట్ లో ప్రకటించారు.
ఇలా దేశంలో చాలామంది సూచనలు ఈసారి బడ్జెట్ లో కనిపించాయి.