Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ‌కు షాక్ః ఎమ్మెల్యే రాజీనామా

By:  Tupaki Desk   |   5 Jan 2017 1:36 PM GMT
చిన్న‌మ్మ‌కు షాక్ః ఎమ్మెల్యే రాజీనామా
X
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియ‌మితులై త్వ‌ర‌లో సీఎం ప‌ద‌విని చేప‌ట్టేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ దివంగ‌త త‌మిళ‌నాడు సీఎం ఆత్మీయురాలు శశికళ నటరాజన్ కు ఊహించ‌ని షాక్ ఎదురైంది. చిన్న‌మ్మ‌ను సీఎంగా కుర్చోపెట్టాలని ప‌లువురు ప్రయత్నిస్తుండ‌టాన్ని నిర‌సిస్తూ అన్నాడీఎంకే పార్టీకి చెందిన మైలాపూర్ శాసనసభ నియోజక ఎమ్మెల్యే నటరాజ్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ వారసురాలిగా తెర‌మీద‌కు వ‌చ్చిన శ‌శిక‌ళ ఆదిలోనే నియంతృత్వం ప్ర‌ద‌ర్శిస్తున్నారని పేర్కొంటూ త‌న ఎమ్మెల్యేగిరీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి త‌మిళ రాజ‌కీయాల్లో క‌ల‌కలం సృష్టించారు. జయలలితకు వీరాభిమాని అయిన నటరాజ్ అమ్మ వార‌సురాలిగా వచ్చిన చిన్న‌మ్మ‌కు వ్య‌తిరేకంగా రాజీనామా చేయ‌డం అన్నాడీఎంకే వ‌ర్గాల్లో చ‌ర్చోప‌చ‌ర్చ‌ల‌కు దారితీసింది.

అమ్మ అభిమానిగానే కాకుండా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించే నాయ‌కుడిగా పేరున్న న‌ట‌రాజ్ చిన్న‌మ్మ‌కు ప‌ద‌వీ బాధ్య‌త‌లు ఇవ్వ‌డం - త్వ‌ర‌లోనే సీఎం పోస్టు చేప‌ట్టేందుకు పైర‌వీలు సాగుతుండ‌టాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఈ క్ర‌మంలో త‌న పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించిన అనంత‌రం రాజీనామా చేశారు. ఇదిలాఉండ‌గా ఇప్ప‌టికే జ‌య‌ల‌లిత మేన‌కోడ‌లు దీపా చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతున్న సంగ‌తి తెలిసిందే. కే తమిళనాడులోని అనేక జిల్లాల్లోని ద్వితీయ - తృతీయ శ్రేణి నాయకులు - కార్యకర్తలు శశికళకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప‌రిణామాల్లో భాగంగా న‌ట‌రాజ్ రాజీనామా క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. న‌ట‌రాజ్ బాట‌లోనే మ‌రింత మంది ప‌ద‌వి వీడ‌నున్నార‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/