Begin typing your search above and press return to search.

ఈ నాలుగు కాళ్ల సుందరి మీకు తెలుసా?

By:  Tupaki Desk   |   25 July 2021 10:41 AM GMT
ఈ నాలుగు కాళ్ల సుందరి మీకు తెలుసా?
X
సాధారణంగా మనుషులు అందరికీ రెండే కాళ్లు ఉంటాయి. లింగభేదం అనేది ఉండదు. ఆడ, మగ అందరూ ఒకేలా వారి వారి అవయవాలను కలిగి ఉండటం మనం పరిశీలించొచ్చు. అయితే, మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ మహిళ మాత్రం వెరీ డిఫరెంట్ అట. ప్రపంచానికే ఆమె జీవితం ఒక వింత. ఆమెకు నాలుగు కాళ్లు ఉన్నాయట. అదెంటీ? నాలుగు కాళ్లు ఉండటమేంటి? ఉట్టి అపోహలే అనుకుంటే మీరు పొరపడినట్లే. నిజంగానే ఈ మహిళకు నాలుగు కాళ్లు ఉన్నాయి. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె జీవిత చరిత్ర ఏంటి? అనే వివరాలు పూర్తిగా తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా చదవాల్సిందే.

నార్త్ కరోలినా అనే దేశంలోని లింకన్ కౌంటీలో జన్మించిన మైర్‌ట్లే కార్బిన్ అనే ఆవిడ సాధారణంగానే జన్మించింది. కానీ, ఆమెకున్న స్పెషల్ ఫీచర్స్ ఆమెను చిన్న వయస్సులోనే సెలబ్రిటీని చేశాయి. కార్బిన్ లైఫ్ హిస్టరీ నిజంగానే ఓ మిస్టరీ అని చెప్పొచ్చు. 1868లో కార్బిన్ జన్మించగా, అరుదైన మహిళగా ఈమెకు గుర్తింపు లభించింది. అయితే, ఆమె ఒక్కరు కాదు ఇద్దరు అనగా ఒకటిగా కనిపించే ట్విన్స్. అసాధారణ రూపంతో వింతగా నాలుగు కాళ్లతో ఈమె పుట్టింది. కార్బిన్ ఎక్కువ రోజులు బతకదని వైద్యులు అంచనా వేశారు. కానీ, ఈమె 60 ఏళ్లు జీవించడం విశేషం. గర్భాశయంలో పిండం సరిగా వృద్ధి చెందకపోవడం వల్లే ఇలా వింతగా శిశువు జన్మించిందని ఇది అరుదైన విషయమని వైద్యులు పేర్కొన్నారు.

కార్బిన్‌కు రెండు జననేంద్రియాలు, రెండు గర్భాశయాలు, నాలుగు కాళ్లు ఉన్నాయి. అయితే, కార్బిన్ చూడటానికి‌నార్మల్ గానే కనిపిస్తుంది. నడుము వరకు నార్మల్ స్త్రీ మాదిరిగానే ఉండగా నడుము కింది భాగంలో నాలు కాళ్లు ఉంటాయి. ఇక ఒక్కో కాలుకు మూడేసి వేళ్లు ఉంటాయి. అయితే, నాలుగు కాళ్లలో కేవలం ఒకటే కాలు సరిగా పని చేస్తుంది. కాగా ఆమె రూపమే ఆమెకు వరమైంది. మీడియా కార్బిన్ గురించి ప్రచారం చేయగా, అతి చిన్న వయసులోనే ఆమె సెలబ్రిటీ హోదా పొందింది. దాంతో ఒక సర్కస్ కంపెనీ ఆమెను అడాప్ట్ చేసుకుంది. అలా ఆమె వారానాకి సుమారు రూ.30 వేలు సంపాదించేది. ఈ క్రమంలోనే అందగత్తెయైన కార్బిన్‌ను బిక్‌నెల్ అనే డాక్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు.

మ్యారేజ్ తర్వాత సర్కస్ కంపెనీలో జాబ్ మానేసిన కార్బిన్ భర్తతో జీవనం సాగించింది. అనుకోకుండా ఆమె ఒక రోజు అనారోగ్యం పాలైంది. వైద్యులు పరీక్షించగా ఆమె ప్రెగ్నెంట్ అని తేలింది. ఆమెకు రెండు గర్భాశయాలున్నాయని గమనించారు వైద్యులు. కార్బిన్ ఒకరి తర్వాత మరొకరికి అనగా ఒక మగబిడ్డ, నలుగురు ఆడపిల్లలకు జన్మించింది. అయితే, తల్లిగా వారిని పెంచి పెద్దచేసిన కార్బిన్ 60వ ఏట మరణించింది. అయితే, అది సహజ మరణం కాదు. కార్బిన్ కుడికాలికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. దానికి అప్పట్లో చికిత్స లేదు దాంతో వ్యాధి అటాక్ చేసిన వన్ వీక్‌లోనే జరిగిపోయింది.

ఈ సందర్భంలో ఆమె మృతదేహాన్ని రీసెర్చ్ నిమిత్తం తమకు ఇవ్వాలని పలు వైద్యబృందాలు కోరాయి. కానీ, అందుకు కార్బిన్ కుటుంబీకులు ఒప్పుకోలేదు. ఇక కార్బిన్‌కు పుట్టిన పిల్లలందరూ ఒకే గర్భాశయం నుంచి వచ్చిన వారు కాదనే వార్తలూ వచ్చాయి. అయితే, ఈ విషయమై పరిశోధనకు కార్బిన్ మృతదేహాన్ని పరిశీలించేందుకు వైద్యులు ప్రయత్నించారు. కానీ, చివరకు విఫలయత్నమే చేశారు.

ఆమె కుటుంబీకులు డెడ్ బాడీని కూడా వైద్యులు చూసేందుకు అనుమతించలేదు. దహస సంస్కారాలు చేసి కాంక్రీట్‌తో సమాధి నిర్మించారు. మొత్తానికి కార్బిన్ జన్మ రహస్య అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. మిస్టరీ ఛేదించేందుకు వైద్యులు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.