Begin typing your search above and press return to search.

ప్రత్యేక విమానంలో 2వేల నోట్ల రహస్య ఆపరేషన్?

By:  Tupaki Desk   |   13 Nov 2016 4:54 AM GMT
ప్రత్యేక విమానంలో 2వేల నోట్ల రహస్య ఆపరేషన్?
X
ఆఖరి నిమిషం వరకూ రూ.2వేల నోటుకు సంబంధించి వివరాలే బయటకు రాలేదు. రూ.2వేల నోటుతో పాటు పెద్దనోట్ల రద్దుకు సంబంధించి ప్రధాని మోడీ సంచలన ప్రకటనకు రెండు.. మూడు రోజుల ముందు రూ.2వేల నోటుకు సంబంధించిన ఒక పోస్టింగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అంతవరకూ రూ.2వేల నోటుకు సంబంధించిన ఊసే లేదు. రూ.2వేల నోటును ప్రింట్ చేసి.. జనాల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనను అమలు చేయటానికి మోడీ సర్కారు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మైసూర్ ప్రధాన కేంద్రంగా చేపట్టిన రూ.2వేల నోట్ల ప్రింటింగ్ వ్యవహారం మొత్తం అత్యంత రహస్యంగా జరిగిన విషయాన్ని మర్చిపోకూడదు. రూ.2వేల నోట్ల ప్రింటింగ్.. అనంతరం ఈ కొత్త నోట్లను దేశ వ్యాప్తంగా తరలించేందుకు చేపట్టిన ప్రక్రియకు సంబంధించిన కొత్త సంగతులు తాజాగా బయటకు వచ్చాయి.

రూ.2వేల నోటు మీద గడిచిన రెండు నెలలుగా రహస్యంగా పని జరుగుతోంది. ప్రింట్ చేసిన నోట్లను దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు రవాణా చేసేందుకు వీలుగా మైసూర్ విమానాశ్రయంలో ఒక ప్రైవేటు విమానాన్ని కేంద్రం వినియోగించింది. రూ.2వేల నోట్లను గడిచిన రెండు నెలలుగా రవాణా చేస్తున్న సదరు ప్రైవేటు విమానం గురించి ఎవరూ పట్టించుకోకపోవటం ఒక ఎత్తు అయితే.. ఆర్ బీఐ తో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు రూ.2వేల నోట్లను ఎంత గుట్టుగా తరలించారో చూస్తే.. కేంద్రం ఎంత రహస్యంగా తాను అనుకున్న ఆపరేషన్ ను పూర్తి చేసిందో ఇట్టే అర్థం కాక మానదు.

ప్రపంచంలోనే అత్యుత్తమ కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ప్రెస్సుల్లో ఒకటి చెప్పే మైసూర్ కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ తనకున్న పేరుప్రఖ్యాతులకు తగ్గట్లే రూ.2వేల నోట్ల విషయంలోనూ గోప్యతను ప్రదర్శించింది. గతంలో రూ.వెయ్యి నోటును ప్రింట్ చేసిన అనుభవం ఉన్న ఈ ప్రింటింగ్ ప్రెస్ తాజాగా రూ.2వేల నోటు విషయంలో తనకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసిందనే చెప్పాలి. మైసూర్ ప్రెస్ నుంచి దేశంలోని వివిధప్రాంతాలకు రూ.2వేల నోట్లను తరలించేందుకు వినియోగించిన ప్రత్యేక ప్రైవేటు విమానం అద్దె కోసమే రూ.73.42 లక్షల మొత్తాన్ని చెల్లించినట్లుగా చెబుతున్నారు. మైసూర్ ప్రింటింగ్ ప్రెస్ ప్రత్యేకత ఏమిటంటే.. ప్రెస్ ఆవరణలోనే స్పెషల్ సెక్యూరిటీ కరెన్సీ పేపర్ తయారీకి సొంతంగా ఒక యూనిట్ కూడా ఉంది. ఆర్ బీఐ కొత్త గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. రూ.2వేల కొత్త నోటు ప్రింటింగ్ పని మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/