Begin typing your search above and press return to search.
400 ఏళ్ల శాపానికి బ్రేక్..సంతోషంలో మైసూర్ రాజవంశం
By: Tupaki Desk | 16 Jun 2017 5:42 AM GMTశాపాలు.. వరాలు లాంటివి ఏమీ లేవని చెబుతుంటారు. కానీ.. సైన్స్ కు అంతుచిక్కని అంశాలెన్నో. అలాంటిది మైసూర్ రాజవంశీకులను వెంటాడుతున్న శాపం. దాదాపు 400 ఏళ్లుగా మైసూర్ రాజవంశానికి సంతాన భాగ్యం లేని సంగతి తెలిసిందే. పెద్ద రాజ్యం. అంగబలం.. అర్థబలం మాత్రమే కాదు.. అన్ని ఉన్నా సంతాన భాగ్యం లేని దుస్థితి. దీంతో.. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిని దత్తత తీసుకోవటం మినహా మరింకేమీ చేయలేని పరిస్థితి.
అయితే.. వందల ఏళ్లుగా వెంటాడుతున్న శాపం తాజాగా తీరిపోయిందన్న మాట ఇప్పుడు సంచలనంగా మారింది.ఎందుకంటే.. గత ఏడాది జూన్ 27న అంగరంగ వైభవంగా జరిగిన మైసూర్ రాజవంశీకుడు యదువీర్ కృష్ ణ త్త చామరాజు ఒడెయార్.. త్రిషిక కుమారి దంపతులు తల్లిదండ్రులు కావటం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్రిషిక కుమారికి ఇప్పుడు ఐదో నెలగా చెబుతున్నారు.
కోడలు కడుపు పండిన విషయాన్ని తెలుసుకున్న రాజమాత ప్రమోదాదేవి ఆనందం అంతాఇంతా కాదని తెలుస్తోంది. ఇంతకీ.. శాపం ఏమిటి? 400 ఏళ్లుగా వెంటాడటం ఏమిటన్న విషయంలోకి వెళితే.. చరిత్రలోకి వెళ్లాలి.
చరిత్ర ప్రకారం క్రీ.శ. 1612లో తిరుమల రాజు మైసూరు సింహాసనాన్ని ఏలుతున్న వేళ.. రాజ ఒడయార్ ఆయనపై తిరుగుబాటు చేసి రాజు అయ్యారు. దీంతో.. ఆవేదనకు గురైన తిరుమలరాజు సతీమణి అలవేలమ్మ కొన్ని ముఖ్యమైన ఆభరణాలు తీసుకొని తలకాడకు వెళ్లిపోతుంది. అయితే.. ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ఒడయార్ సైనికులు ఆమెను చుట్టుముడతారు. దీంతో ఆగ్రహించిన అలవేలమ్మ.. తమ రాజ్యాన్ని ఆక్రమించిన మైసూర్ గద్దెనెక్కిన రాజు వంశస్థులకు ఎప్పటికీ కడుపు పండదని.. ఆ వంశానికి సంతాన భాగ్యం అన్నది ఉండదంటూ శపిస్తుంది. ఆమె శాప ప్రభావమో.. మరింకే కారణమో కానీ.. చిత్రంగా అప్పటి నుంచి ఇప్పటివరకూ మైసూర్ రాజవంశీకుల్లో ఎవరికి సంతాన భాగ్యం లేకుండా పోయింది.
దీంతో ఎప్పటికప్పుడు దత్తత తీసుకోవటం ద్వారా రాజవంశాన్ని నడిపిస్తున్నారు. అలా రాజు అయిన వారెవరూ సంతానాన్ని పొందకపోవటం రాజవంశాన్ని ఎప్పుడూ తల్లడిల్లేలా చేస్తోంది. తాజాగా ఆ శాపానికి బ్రేక్ అన్నట్లుగా.. యువరాణి కడుపు పండటం.. రానున్న దసరా నాటికి బుల్లి యువరాజుల వారు వచ్చేస్తుండటంతో మైసూర్ రాజవంశం చాలా హ్యాపీగా ఉన్నట్లుగా చెబుతున్నారు. రాజవంశానికి చెందిన జ్యోతిష్యుల మాట ప్రకారం.. పండంటి మగబిడ్డ పుడతాడని చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/