Begin typing your search above and press return to search.

ఫుణె మహిళల్లో మిస్టరీ బ్రెస్ట్ వైరస్

By:  Tupaki Desk   |   29 March 2016 8:54 AM GMT
ఫుణె మహిళల్లో మిస్టరీ బ్రెస్ట్ వైరస్
X
మహారాష్ట్రలోని ఫూణె నగరంలోని మహిళలు అంతుచిక్కని వ్యాధితో తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు. ఈ నగరానికి చెందిన మహిళల రొమ్ముల్లో ప్రమాదకర వైరస్ ఒకటి దర్శనమిస్తుంది. దీన్ని ఎలా అరికట్టాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రొమ్ముల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావటం.. తీవ్రమైన నొప్పికి గురి చేయటం.. అప్పుడప్పుడు ద్రవాలు స్రవించటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి.

ఈ నొప్పిని తాళలేక వైద్యులవద్దకు వెళుతున్న మహిళలకు వారు రకరకాల పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా నొప్పి తగ్గని పరిస్థితి. రొమ్ములో చేరిన అంతుచిక్కని వైరస్ తో ఇలాంటి ఇబ్బంది ఏర్పడుతుందన్న వాదన వినిపిస్తోంది. గతంలో అరుదుగా కనిపించే ఇలాంటి కేసులు గడిచిన సంవత్సర కాలంలో తరచూ వస్తున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. తాజాగా ఇలాంటి సమస్యలతో ఆసుపత్రికి వస్తున్న మహిళల సంఖ్య ఎక్కువైనట్లు చెబుతున్నారు.

ఇంతకీ ఈ వ్యాధి ఏమిటన్న విషయంపై డాక్టర్లు ఏకాభిప్రాయానికి రాకపోవటం గమనార్హం. దీన్ని కొందరు రొమ్ము టీబీని పోలినట్లుగా చెబుతుంటే.. మరికొందరు రొమ్ము శస్త్రచికిత్సలు చేయించుకోవటం కనిపిస్తోంది. అయితే.. ఇలా ఆపరేషన్లు చేయించుకున్న వారికి సైతం సమస్య పరిష్కారం కాకపోవటం గమనార్హం. ఈ ఇన్ఫెక్షన్ పై సీనియర్ వైద్యులు తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైద్య నిఫుణులు.. అంకాలజిస్ట్ లతో చర్చిస్తున్నట్లగా ఫూణె వైద్యులు చెబుతున్నారు. హార్మోన్ల పెరుగుదలలో అసమతుల్యత.. రోగనిరోధక శక్తి తగ్గిపోవటం.. రొమ్ములో గడ్డలు ఏర్పడి అవి ఇన్ఫెక్షన్ కు కారణం అవుతున్నాయని.. ఈ వ్యాధి నిర్ధారణకు మరింత రీసెర్చ్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా ఫూణె మహిళల్లో కనిపిస్తున్న ఈ రొమ్ము వైరస్ అందరిని హడలెత్తిస్తోందని చెప్పక తప్పదు.