Begin typing your search above and press return to search.
డెడ్ బాడీస్ పడవలు తీరానికి కొట్టుకొస్తున్నాయ్
By: Tupaki Desk | 2 Dec 2015 10:30 PM GMTకొద్ది రోజులుగా జపాన్ తీరానికి చేరుతున్న పడవల మిస్టరీ కలకలాన్ని రేపుతోంది. డెడ్ బాడీస్ ఉన్న పడవలు జపాన్ సముద్ర తీరానికి చేరుకుంటున్నాయి. వీటిల్లోని మృతదేహాలు బాగా కుళ్లిపోయి ఉండటం.. కొన్నింటికి తలలు లేకపోవటం ఇప్పుడో మిస్టరీగా మారింది. ఈ పడవులు ఎక్కడవి? ఎవరివి? ఈ మృతదేహాల సంగతేమిటి? అన్నది జపాన్ వర్గాలకు ఒక పట్టాన వంట పట్టటం లేదు. ఇప్పటివరకూ ఇలా జపాన్ తీరానికి కొట్టుకు వచ్చిన చెక్క పడవలు 12 వరకూ ఉండటం గమనార్హం.
జపాన్ తీరానికి కొట్టుకొచ్చిన చెక్క పడవల్లో ఇప్పటివరకూ 22 మృతదేహాలు లభ్యమయ్యాయి. అక్టోబర్ నుంచి ఈ డెడ్ బాడీస్ పడవల మిస్టరీ షురూ అయ్యింది. కొన్ని పడవల్లో మృతదేహాలు ఉంటే.. మరికొన్ని పడవల్లో పుర్రెలు ఉన్నాయి. ఇలా కొట్టుకు వస్తున్న పడవలు ఎక్కడివి? ఎవరివి? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకటం లేదు. ఇలా కొట్టుకొచ్చిన ఒక పడవ మీద మాత్రం కొరియన్ పీపుల్స్ ఆర్మీ అన్న పేరు రాసి ఉంది. పడవల్లో కనిపిస్తున్న ఆధారాలతో ఈ పడవులు ఉత్తర కొరియా నుంచి వచ్చి ఉంటాయన్న భావన వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ పడవల మిస్టరీ జపాన్ అధికారులకు ఒక సవాలుగా మారిందని చెప్పక తప్పదు.