Begin typing your search above and press return to search.

ఆకాశం నుంచి ఊడిపడిన వింత వస్తువు

By:  Tupaki Desk   |   23 Jun 2020 12:30 AM GMT
ఆకాశం నుంచి ఊడిపడిన వింత వస్తువు
X
అంతరిక్షం ఉహకు అందనిది. ఈ విశ్వంలో మనం తెలుసుకున్నది రవ్వంత.. తెలియాల్సి ఉంది కొండంత. ఎప్పుడు ఏవో మార్పులు అంతరిక్షంలో చోటుచేసుకుంటుంటాయి. వాటి ప్రభావం భూమిపై పడుతుంది. అందుకే అప్పుడప్పుడు ఆకాశం నుంచి కొన్ని వస్తువులు, పదార్థాలు పడుతుంటాయి. అలాంటిదే ఇప్పుడు రాజస్థాన్ లో జరిగింది. ఆకాశం నుంచి ఏదో వస్తువు కింద పడింది. ఆ వస్తువు ఏమిటో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పైగా పెద్ద శబ్ధంతో భూమిపై పడడంతో ఉలిక్కిపడ్డారు.

రాజస్థాన్ లోని సంచోరే టౌన్ లో హఠాత్తుగా ఆకాశం నుంచిపెద్ద శబ్దం చేస్తూ ఒక వింత వస్తువు ఊడిపడింది. అక్కడి ప్రజలు అదేమిటో తెలియక కంగారు పడ్డారు. వెంటనే ప్రభుత్వ అధికారులకు, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఆ వస్తువు వివరాలు నమోదు చేసుకున్నారు. ఆ వస్తువు 2.78 కేజీ బరువుతో ఉందని అంచనా వేశారు. చాలా పెద్ద శబ్దం చేస్తూ ఆకాశం నుంచి పడడంతో దాని శబ్దం దాదాపు 3 కిలోమీటర్ల వరకు వినిపించిందని తెలుస్తోంది.

ఆ వస్తువు పడిన స్థలంలో భూమిపై ఒక అడుగు లోతున గొయ్యి ఏర్పడింది. స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులు అక్కడికి చేరుకునేటప్పటికి ఆ వస్తువు ఇంకా వేడిగా పొగలు కక్కుతూ ఉంది. చల్లారక దాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.

ఆ వస్తువును ఓ నిక ప్రైవేట్ ల్యాబ్ వారు పరిశీలించారు. అది ఒక ఉల్కా కు సంబంధించిన ముక్క అని తేల్చారు. జెర్మేనియం.. ప్లాటినం.. నికెల్.. ఐరన్ లోహల మిశ్రమాలు కలయిక తో ఆ వస్తువు ఉందని గుర్తించారు. దీని విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉండవచ్చు అని సమాచారం. మిగతా పరిశోధనల కోసం ఆ వస్తువును అహ్మదాబాద్ లో ని భౌగోళిక సర్వే ఆఫీస్ తరలించేలా ఉన్నారు. ఈ మేరకు అధికారులు భౌగోళిక సర్వే ఆఫీస్ లోని అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.