Begin typing your search above and press return to search.

మిస్టరీగా రేవంత్ ఆస్తుల చిట్టా:రూ.5 లక్షల ఆదాయంతో 10 కోట్ల ఆస్తులపై ఆరా?

By:  Tupaki Desk   |   29 March 2020 1:50 PM GMT
మిస్టరీగా రేవంత్ ఆస్తుల చిట్టా:రూ.5 లక్షల ఆదాయంతో 10 కోట్ల ఆస్తులపై ఆరా?
X
ఒక నెలంతా కష్టపడి పని చేస్తే సాధారణ ఉద్యోగికి 30 నుండి 40వేలు వస్తాయి. ఇక సాఫ్ట్ వేర్ అయితే - ఓ లక్ష వరకు జీతం ఉంటుంది. ఇక ప్రజాప్రతినిధి అయితే జీతం - అలవెన్స్ అన్నీ చూసుకుంటే నెలకు ఓ నాలుగైదు లక్షలు వస్తాయి. ప్రజా ప్రతినిధి కాబట్టి ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఒకవేల వచ్చిన జీతం మొత్తం దాచుకున్నా కటింగ్స్ అన్నీ పోను ఐదేళ్లకు ఓ కోటి రూపాయలు ఉంటుంది. ఏడాది మొత్తం ఐదు లక్షల ఆదాయం చూపించిన ఆ ప్రజాప్రతినిధి.. ఐదేళ్ల తర్వాత 10 కోట్ల రూపాయల ఆదాయం చూపిస్తే ఏమంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో ఇలాగే జరిగింది.

2009 ఎన్నికల సమయంలో అఫిడవిట్‌ దాఖలు చేస్తూ ... తన ఆస్తులు అన్నీ కలిపి 3 కోట్ల ఆరు లక్షలుగా రేవంత్ రెడ్డి చూపించారు. అలాగే ,73 లక్షలు అప్పులు ఉన్నాయని చెప్పారు. అయితే , అయన గత కోనేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు ఆ మాత్రం ఆస్తులు ఉండవా అనుకున్నారు. ఈ విషయం పక్కన పెడితే ..మళ్లీ 2014 ఎన్నికల సమయంలో మరోసారివ అఫిడవిట్ దాఖలు చేసేటప్పుడు మాత్రం తన ఆస్తులను రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం 13 కోట్ల 12 లక్షలుగా ఉన్నాయని తెలిపారు. అలాగే, అప్పులు 3 కోట్ల రూపాయలు ఉన్నాయని చూపించారు. దీని బట్టి ... 2009 నుంచి 2014 మధ్య ఐదేళ్ల కాలంలోనే రేవంత్ ఆస్తులు రూ.10 కోట్లు పెరిగాయి.

ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆస్తులు - అప్పులు కోట్ల రూపాయల్లో చూపించిన రేవంత్ రెడ్డి...తన ఆదాయాన్ని మాత్రం లక్షల్లోనే చూపించారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే ... 2012-2013 ఏడాది ఐటీ రిటర్న్స్ లో ఏడాది ఆదాయం కేవలం 5 లక్షల 53వేలు మాత్రమే అని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే .. నెల ఆదాయం 46వేల రూపాయలు మాత్రమే. మరి ఆస్తులు కోట్లలో ఎలా పెరిగాయి అనేది పెద్ద మిస్టరీ. నెలకు 46వేల రూపాయల ఆదాయం ఉండే వ్యక్తి.. సరాసరిన లెక్కించిన ఏడాదికి 2 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కూడబెట్టారు అనేది ఇప్పటికీ కేంద్ర ఆర్థిక శాఖకు కూడా అంతుచిక్కటం లేదు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, అంతర్జాతీయ ఆర్థిక వేత్తలు కూడా తలలు పట్టుకుంటున్నా లెక్క తేలడంలేదంట. ఆదాయం లేకుండా ఆస్తులు చూపించారు అంటే అది మరో మార్గంలో వచ్చినట్లే అని ఆదాయ పన్నుశాఖ అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఏడాది క్రితం తనిఖీల్లో బయటపడిన ఈ లెక్కలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణకు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మరి ..ఈ లెక్కల మిస్టరీ ఎప్పుడు తేలుతుందో ..