Begin typing your search above and press return to search.
వేద నిలయంలో అంతు చిక్కని`రహస్యం`?
By: Tupaki Desk | 22 Aug 2017 11:48 AM GMTహైడ్రామాను తలపించిన తమిళనాడు రాజకీయాలకు శుభం కార్డు పడింది. ఈపీఎస్ - ఓపీఎస్ వర్గాలు మళ్లీ ఒక్కటయ్యాయి. ఇక తమిళనాట అంతా ప్రశాంతంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కానీ ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. అదే వేదనిలయం! తమిళనాడు మాజీ సీఎం - దివంగత జయలలితకు ఎంతో ఇష్టమైన పోయెస్ గార్డెన్ లోని ఆమె నివాసం వేద నిలయాన్ని స్మారక నిలయంగా మార్చేందుకు తమిళ సర్కారు చర్యలు తీసుకుంటుంటే.. ఆ నిలయం తమకే దక్కాలని జయలలిత మేనకోడలు - శశికళ వర్గం గట్టిగా వాదిస్తున్నాయి. ఒక్క బిల్డింగ్ కోసం ఎందుకింత పట్టుదల అనే సందేహాలు అందరిలోనూ వస్తున్నాయి. అయితే దీని వెనుక అసలు నిజం వేరే ఉందట!!
వేలకొద్దీ చీరలు.. కిలోల చొప్పున బంగారం - వెండి - ఆభరణాలు - హారాలు - నగలు.. ఇలా ఒకటా రెండా లెక్కపెట్టడానికి కొన్ని రోజులు సరిపోనంత ఆస్తి.. `అమ్మ` సొంతం! ఇప్పుడు అదంతా ఎక్కడ ఉంది? అనే విషయాలు మాత్రం బయటికి పొక్కడం లేదు. ఇదే సమయంలో ఆమె జీవితకాలం గడిపిన పోయిస్ గార్డెన్ లోని వేదనిలయం మాకు దక్కాంటే మాకు దక్కాలనే డిమాండ్లు ఎక్కువైపోయాయి. అయితే ఇప్పుడు దీని గురించి తమిళనాడులో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. జయలలిత ఇంటిపై ప్రేమతో వారంతా ఆ ఇల్లు కావాలనుకోవడం లేదట.
వేదనిలయంలోని ఒక గది కోసమే ఈ పోరాటమనే వదంతులు వినిపిస్తున్నాయి. జయలలిత తన జీవితకాలంలో సంపాదించిన సొత్తు మొత్తాన్ని ఒక రహస్య గదిలో దాచి ఉంచారని, ఆ గది తెరవడం అంత సులభం కాదని తెలుస్తోంది. ఆ గదికి సంబంధించిన బయోమెట్రిక్ కీ జయలలిత దగ్గరే ఉందని, తన కాలి ముద్రలతో మాత్రమే ఆ సీక్రెట్ డోర్ ను తెరవగలరని చెబుతున్నారు.