Begin typing your search above and press return to search.
ఆరుగురి సజీవదహనం వెనుక వీడిన మిస్టరీ..!
By: Tupaki Desk | 21 Dec 2022 5:33 AM GMTమంచిర్యాల జిల్లా గుడిపెల్లిలో శుక్రవారం రాత్రి ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు సజీవ దహనమైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పక్కా పథకం ప్రకారం ఇంటిని పెట్రోల్ పోసి తగలెబట్టడంతోనే ఆ ఇంట్లోని వారంతా సహజీవనం అయ్యారని పోలీసులు దర్యాప్తులో తేలడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ కేసు సంబంధం ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రామగుండం సీపీ తాజాగా వెల్లడించారు.
సింగరేణి ఉద్యోగి శాంతయ్య.. సజృన భార్యభర్తలు. వీరిద్దరి ఒక కుమార్తె ఉంది. అయితే ఇటీవల శాంతయ్య గుడిపెల్లికి చెందిన పద్మ అనే మహిళతో అదే గ్రామంలో సహజీవనం చేస్తున్నాడు. తన జీతభత్యాలను ఆమెకే ఇస్తానని తన భార్యతో తరుచూ గొడవకు దిగేవాడు. ఈ క్రమంలోనే సృజనకు డాక్యుమెంట్ రైటర్ లక్ష్మణ్ తో 2010లో పరిచయం ఏర్పడింది.
అతడి వద్ద నుంచి సృజన 4 లక్షల అప్పు తీసుకుంది. అప్పు వసూలు చేసే క్రమంలో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే తన భర్త వేరే మహిళలతో సహజీవనం చేస్తూ తనను పట్టించుకోకపోవడంతో.. ఆస్తిని సైతం ఆమెకు ఇచ్చే ప్రయత్నం చేస్తుండటంతో సృజన రగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే తన భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది.
ఇందుకోసం తన ప్రియుడు లక్ష్మణ్ ను ఉసిగొల్పింది. తన భర్తను హత్య చేయిస్తే తన కూతురి పేరిట ఉట్కూరులో ఉన్న 1.50కోట్ల విలువ చేసే భూమిని రాసిస్తానని అతడికి ఆశ చూపించింది. ఈక్రమంలోనే లక్ష్మణ్ లక్షెట్టి పేటలో పందుల వ్యాపారం చేసే రమేష్ ను సంప్రదించాడు. శాంతయ్యను హత్య చేస్తే 4 లక్షలు ఇస్తానని ఆశ చూపించాడు. ఇందులో భాగంగా మహేష్ అనే వ్యక్తి వద్ద నుంచి బోలోరో వాహనం కొని ఇచ్చాడు.
అలాగే గుడిపల్లిలో శ్రీను అనే వ్యక్తి ద్వారా సమ్మయ్య అనే వ్యక్తిని సంప్రదించారు. శాంతయ్య.. పద్మలకు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని చెబితే 1.50 లక్షలు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు నెల కిందట శాంతయ్య.. పద్మను గుడిపెల్లిలో బోలోరో వాహనం ఢీకొట్టించే ప్రయత్నం చేశారు. అయితే అదుపుతప్పి వారే ఓ కందకంలో పడిపోయారు.
ఆ తర్వాత పద్మ.. శాంతయ్యలు మంచిర్యాల ఆస్పత్రికి ఆటోలో వస్తుండగా బోలోరోతో ఢీకొట్టించే ప్రయత్నం చేయగా తృటిలో తప్పించుకున్నారు. అలాగే వీరిని హత్య చేసేందుకు రెండు కత్తులను సైతం కొనుగోలు చేశారు. అయితే దొరికిపోతామనే భయంతో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
ఈనెల 16న సమ్మయ్య రమేష్ కు ఫోన్ చేసి శాంతయ్య.. పద్మలు ఇంట్లోనే ఉన్నారని చెప్పాడు. దీంతో లక్ష్మణ్.. రమేష్ లు మంచిర్యాలకు చేరుకొని మద్యం సేవించారు. అనంతరం శ్రీపతి రాజుకు చెందిన ఆటోలో మూడు క్యాన్ల పెట్రోల్ తీసుకొచ్చారు. గుడిపెల్లి శివారులో వాటిని తీసుకెళ్లి సమ్మయ్య.. రమేష్ లు గ్రామంలోకి వెళ్లారు. అనంతరం శాంతయ్య ఉంటున్న ఇంట్లో పెట్రోల్ పోసి తగులబెట్టారు.
లక్ష్మణ్ అదే ఆటోలో మంచిర్యాలకు చేరుకొని ఓ లాడ్జిలో ఉదయం వరకు ఉండి లక్షెట్టి పేటకు చేరుకున్నాడు. ఆ మర్నాడు రమేష్ వద్దకు వెళ్లి మంటల్లో ఆరుగురు చనిపోయాడని తెలిపాడు. ఈ హత్యల అనంతరం వీరిద్దరు తప్పించుకొని తిరుగుతుండగా మంచిర్యాలలో సృజన.. ఆమె తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.