Begin typing your search above and press return to search.

సందీప్ కేసు లో వీడిన మిస్టరీ ..ఆత్మహత్య కి అదే కారణం ..!

By:  Tupaki Desk   |   12 Nov 2019 11:29 AM GMT
సందీప్ కేసు లో వీడిన మిస్టరీ ..ఆత్మహత్య కి అదే కారణం ..!
X
మరికొద్ది గంటల్లో పెళ్లి కొడుకు గా పెళ్లి కూతురు మేడ లో తాళిని కట్టాల్సిన వాడు .. బట్టలు మార్చు కోవడానికి అని వెళ్లి పెళ్లి మండపం లోని ఫ్యాన్ కి ఉరి వేసుకొని చని పోయిన విషయం అందరికి తెలిసిందే. ఈ ఘటన కొంపల్లి లో జరిగింది. దిల్‌సుఖ్‌ నగర్‌ లక్ష్మీ నగర్‌ లో నివసిస్తున్న శ్రీనివాస చారి, పద్మజా రాణి ఏకైక కుమారుడు సందీప్‌. తన ఎనిమిదేళ్ల వయసు లో తల్లిని కోల్పోయాడు. తండ్రి రెండోపెళ్లి చేసుకోవడం తో . తాతయ్య , అమ్మమ్మ వారి దగ్గరే పెరిగాడు. సాధించాలనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని, జీవితం లో నిలదొక్కు కోవాలని కలలు కన్నాడు. అనివార్య కారణాల వల్ల పెద్దల మాటలని కాదన లేక పెళ్ళి కి ఒప్పుకున్నాడు.

నిశ్చయ తాంబూలాల కార్యక్రమం జరిగిన కొద్ది రోజుల్లోనే తనను ఎంతో ఇష్టంగా పెంచి, పెద్ద చేసిన తాతయ్య అకాల మరణం చెందాడు. తాత మృతి అతడిని కలిచి వేసింది. కొన్ని రోజులు మానసిక వేదన ను అనుభవించాడు. ఇంత లోనే పెళ్లి అనడం తో ప్రతి చిన్న విషయానికి ఆవేశం, కోపం ప్రదర్శించే వాడు. తల్లి చనిపోయిన ఇంట్లో పెళ్లి కొడుకుగా తయారు కాలేనని అనేవాడు. వేరే ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడే ఉండేవాడు. ఆ ఇంట్లో కూడా తండ్రి తో పెళ్లి విషయం లో వాదనకు దిగే వాడని తెలిసింది. పెళ్లి అనుకున్న దగ్గర నుంచి సందీప్‌ కు నచ్చని సంఘటనలు చోటు చేసుకోవడం, ఇష్టం లేని పనులు చేయాల్సి రావడం, తనకు ఎవరూ లేరనే బాధ, ఒంటరితనం అతడిని కుంగ దీసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమం లోనే పెళ్లి కి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి మండపం లో దుస్తులు మార్చు కోవడానికి గది లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మనసును అర్థం చేసుకునే వారు లేరని బాధ, తల్లి, తాతయ్య జ్ఞాపకాలు, ఒంటరితనంతో మానసిక సంఘర్షణ కు లోనై బలవంతం గా ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసుల విచారణ లో తేలినట్లు తెలుస్తోంది. ఆ రూమ్ లోకి వెళ్ళినప్పుడు తనతో పాటు ఎవరైనా వెళ్లింటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. సందీప్‌ తండ్రిని పెద్ద మనిషి లా, వార్డెన్‌ లాగే చూసే వాడని తెలిసిన వ్యక్తులు తెలుపుతున్నారు.