Begin typing your search above and press return to search.
బోధి ధర్మ చనిపోయాడా? బతికే ఉన్నాడా?
By: Tupaki Desk | 11 April 2020 11:30 PM GMTబోధి ధర్మ.. ఈ పేరు భారతీయులకు పెద్దగా తెలియకపోయినా.. చైనీయులకు మాత్రం బాగా తెలుసు. బోధి ధర్మ ఒక భారతీయుడే.. చైనాకు వెళ్లి అక్కడి వారికి మరో బౌద్దుడిగా మారిపోయాడు. ఆయన తెలుగువాడనే వాదన కూడా ఉంది. బోధిధర్మ గురించి 'సెవెన్త్ సెన్స్' సినిమా వచ్చే వరకు కూడా ఆయన ఎవరో కూడా భారతీయులకు తెలియదంటే అతిశయోక్తి కాదు.. ఇండియాలో పుట్టి చైనా ప్రజల ఇష్టదైవంగా మారిన బోధి ధర్మ.. బౌద్ద ధర్మ కోసం తన వ్యక్తిగత జీవితాన్నే త్యజించారు. కరోనా ప్రస్తుతం వ్యాపించిన వేళ ఆయన గురించి అందరూ ఆరా తీస్తున్నారు.
*బోధిధర్మ చరిత్ర
బోధి ధర్మ అసలు పేరు ధర్మ వర్మ. 5వ శతాబ్దంలో తమిళనాడులోని కంచిపురం పాలిస్తున్న రాజు స్కంధవవర్మ మూడో కుమారుడే బోధి ధర్మ. నాటి పల్లవ సామ్రాజ్యానికి మూడో తెలుగు చక్రవర్తిగా పేర్కొంటున్నారు. ఈయనది తమిళనాడు అని.. తెలుగు వ్యక్తి అని రెండు వాదనలున్నాయి. గురువుల ఆజ్ఞలను పాటించి ఈయన చైనా వెళ్లినట్లు చరిత్రలో ఉంది.
*ప్రజ్ఞతార అనే గురువును కలిసిన తరువాత ఆధ్యాత్మిక వాతావరణంలోకి మారారు. తన రాజ్యాన్ని వదిలి ఆశ్రమానికి చేరుకున్నాడు. బౌద్దాన్ని స్వీకరించి ప్రజ్ఞతార వద్ద శిష్యరికం చేశాడని ఆ తరువాత అతడి పేరు బోధి ధర్మగా మారిందంటారు.
ఆ క్రమంలోనే ఆశ్రమంలో కొన్ని యుద్ధ విద్యలు, ప్రాచీన మర్మకళలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ప్రజ్ఞతార నువ్వు మరో బుద్ధుడివని.. బౌద్ధ మతాన్ని విశ్వవ్యాప్తం చేయాలని.. నువ్వు పుట్టుకకు కారణం ఉందని చెప్పి చైనాకు వెళ్లాలని బోధి ధర్మ గురువు అతడిని ఆదేశించారు..
గురువు ఆదేశానుసారం 67 ఏళ్ల వయసులో సముద్ర మార్గం ద్వారా బోధి దర్మ చైనాకు వెళ్లారు.అక్కడికి వెళ్లి తొమ్మిదేళ్లు ధ్యానంలో మునిగిపోతాడు. దీంతో ప్రజలు మరో బుద్ధుడి అవతారంగా బోధి ధర్మను భావించి పూజిస్తారు. వారు ఆదరించి గురువుగా పూజించారు.
ఈ క్రమంలోనే తనకు తెలిసిన విద్యను చైనీయులకు బోధి ధర్మ నేర్పిస్తాడు. 'షావోలిన్ కుంగ్ ఫూ' సృష్టికర్త బోధిదర్మనే. భారతీయ యుద్ధకళలలతో దీన్ని బోధిధర్మ తయారు చేశారు. ఇక ప్లేగు వ్యాధితో చైనాలో లక్షల మంది చనిపోతే దాన్ని నుంచి చైనాను బోధిధర్మ రక్షించాడనే ప్రచారం ఉంది.
బౌద్ధ దర్మ బోధనలు చేస్తూ బోధి దర్మ చైనీయులకు దైవంగా మారారు. బోధి ధర్మ భారతీయ సూత్రాలతో 'చాన్ బుద్దిజం' ను సృష్టించారు.
ఇక బోధిధర్మ చైనాలో బౌద్దాన్ని విస్తరింపచేసి భారత దేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని శిష్యులకు, అక్కడి ప్రజలకు తెలిపారు. అయితే ఆయన భారతదేశానికి పోతే చైనాకు అరిష్టం అని.. తమ బతుకులు ఆగమవుతాయని.. ఆయన తినే ఆహారంలో ఓ శిష్యుడు విషం కలిపి చంపేశాడనే ప్రచారం ఉంది. ఆయనను ఒక పర్వతం కింద సమాధి చేశారని అంటుంటారు. ఇది అసత్యమనే వారు లేకపోలేదు. బోధి దర్మ176 ఏళ్ల వయసులో చనిపోయాడంటారు. ఇక బోధి ధర్మ చనిపోలేదని చైనా ప్రజలు నమ్ముతారు.
అయితే ఓ సైనికుడికి బోధి ధర్మ బూటు పట్టుకొని చైనా సరిహద్దుల్లో కనిపిస్తాడు. దీంతో రాజుకు విషయం తెలుపగా సమాధి తవ్వి చూస్తే అక్కడ బోధి దర్మ మృతదేహం ఉండదని.. బూటు ఉంటుందని.. అప్పటి నుంచి బోధి ధర్మ బతికే ఉన్నాడని చైనీయులు నమ్ముతుంటారు. బోధి ధర్మకు మరణం లేదని చైనీయులు విశ్వసిస్తారు.