Begin typing your search above and press return to search.

బెంగ‌ళూరులో క‌ల‌క‌లం.. ఒక్క‌సారిగా భారీ శ‌బ్ధాలు

By:  Tupaki Desk   |   20 May 2020 2:27 PM GMT
బెంగ‌ళూరులో క‌ల‌క‌లం.. ఒక్క‌సారిగా భారీ శ‌బ్ధాలు
X
క‌ర్నాట‌క రాజ‌ధాని బెంగళూరులో ఒక్క‌సారిగా భారీ శ‌బ్ధాలు వినిపించాయి. ఒక్క‌సారిగా విప‌రీత‌మైన శ‌బ్దాలు రావ‌డంతో న‌గ‌ర‌వాసులు భ‌యాందోళ‌న చెందారు. భూకంపంగా భావించి రోడ్ల‌పైకి ప‌రుగులు పెట్టారు. ఈ ప‌రిణామంతో బుధవారం ప్ర‌జ‌లంతా తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు.

బెంగ‌ళూరులోని హెచ్ఎస్ఆర్, సర్జాపూర్, వైట్ ఫీల్డ్, హెబ్బాల్ తదితర ప్రాంతాల్లో గుర్తు తెలియని, వింత శబ్ధాలు వినపించాయి. దీంతో స్థానికులు ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న చెందారు. భ‌యభ్రాంతుల‌కు గుర‌యి ప్ర‌జ‌లంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. కొందరు భూకంపం వచ్చిందేమోనని రోడ్ల‌పైకి ప‌రుగులు తీశారు. అయితే భూకంపం వ‌ల‌న వ‌చ్చిన చ‌ప్పుళ్లు కావ‌ని కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ సెంటర్ స్ప‌ష్టం చేసింది. సెస్మోమీటర్లలో భూప్రకంపనలు ఏవీ రికార్డు కాలేద‌ని తెలిపింది. ఇవి మిస్టిరియ‌స్ శ‌బ్దాల‌ని పేర్కొంది.

ఆ శ‌బ్ధాలు భూకంపం వ‌ల‌న వ‌స్తే కొన్ని ప్రాంతాల‌కే పరిమితం కాదని చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌కు కూడా వినిపిస్తాయ‌ని తెలిపారు. ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని కేఎస్ఎన్ఎండీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్ర‌క‌టించారు. సెన్సార్లను పరిశీలించామని.. భూకంపం వ‌చ్చిన ఆన‌వాళ్లు క‌నిపించ‌లేవ‌‌ని వెల్ల‌డించారు. ఫైటర్ జెట్స్ వెళ్లడంతోనే ఈ భారీ శ‌బ్దాలు వచ్చి ఉంటాయని ప‌లువురు చెబుతున్నారు. కొందరు స్థానికులు ఆ భారీ శ‌బ్ధాల‌ను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ఆ శ‌బ్ధాలేవో తెలుసుకోవ‌డానికి అధికార యంత్రాంగం విచార‌ణ చేస్తోంది.