Begin typing your search above and press return to search.
మైసూరా పేరుతో తప్పుడు ఇంటర్వ్యూ
By: Tupaki Desk | 11 Nov 2015 7:29 AM GMTమెట్రో ఇండియా అనే ఆంగ్ల పత్రికలో ప్రచురించిన కథనం కలకలం రేపటం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి పేరిట.. ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారంటూ భారీ కథనాన్ని అచ్చేశారు. ఈ కథనంలో.. తమ పార్టీ రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటం చేస్తుందన్నట్లుగా సదరు పత్రిక పేర్కొనటం సంచలనంగా మారింది.
ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యను మైసూరారెడ్డి లాంటి తలపండిన సీనియర్ నేత చేస్తారా? అన్నది ఒక ప్రశ్న. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తరఫున ఇలాంటి వ్యాఖ్యలు చేయటంపై పలువురు షాక్ తిన్న పరిస్థితి. అందుకేనేమో.. మైసూరారెడ్డి ఈ కథనంపై తక్షణం స్పందించారు. పత్రికలో ప్రచురించిన రీతిలో తాను అస్సలు మాట్లాడలేదని మైసూరా రెడ్డి చెబుతున్నారు. అసలు తనతో మాట్లాడకుండా అంత పెద్ద కథనం ఎలా అచ్చేస్తారంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మెట్రో ఇండియా పత్రిక ప్రతినిధితో తాను అస్సలు మాట్లాడలేదని.. ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నది మైసూరా వాదన. తనను సంప్రదించకుండా.. తన పేరిట ఇంత పెద్ద కథనం ఎలా వేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇంతటి బాధ్యతారాహిత్యంతో చేసిన తప్పునకు వెంటనే క్షమాపణలు చెప్పారంటూ మండిపడ్డారు. మరి.. సదరు మీడియా సంస్థ మైసూరా మాటలకు ఎలా స్పందిస్తుందో చూడాలి.