Begin typing your search above and press return to search.
వృద్ధ నారీ పతివ్రతః అన్నట్లే ఈ ఉద్యమం!
By: Tupaki Desk | 5 Nov 2015 5:30 PM GMTరాయలసీమ రాష్ట్రాన్ని సాధించడం కోసం, లేదా, రాయలసీమకు సంబంధించిన హక్కులను సాధించడం కోసం ప్రత్యేకంగా ఉద్యమం సాగిస్తా అంటూ ఇవాళ మైసూరా రెడ్డి చేస్తున్న ఆందోళన చిత్రంగా కనిపిస్తోంది. రాజకీయంగా తన కెరీర్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత.. మైసూరా రెడ్డి ప్రస్తుతం తాను ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాచేసి.. రాయల సీమ రాష్ట్ర సాధన సమితిని ప్రారంభిస్తారని.. ఆ సంస్థ ద్వారా రాయలసీమ కోసం పోరాడుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన తీరు మాత్రం వృద్ధ నారీ పతివ్రతః అన్న సామెతను గుర్తుకు తెస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయంగా తన ప్రస్థానమే చరమాంకానికి చేరుకున్న తరువాత.. మైసూరారెడ్డి తెరతీస్తున్న ఈ సరికొత్త డ్రామా ఏమాత్రం నమ్మశక్యంగా లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మైసూరారెడ్డి రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడు. చంద్రబాబునాయుడు - వైఎస్ రాజశేఖరరెడ్డి ల సమకాలికుడు. గతంలో కాంగ్రెస్ వైఎస్ వ్యతిరేకిగా ఎదిగి, పార్టీపై ఆయన హవా మొదలైన తర్వాత తెలుగుదేశంలో చేరి...వైఎస్ పై పుస్తకాలను కూడా ప్రచురించి..ఎంపీ పదవి గట్రా అనుభవించి.. ఆ తర్వాతి పరిణామాల్లో వైఎస్సార్ కన్నుమూశాక తిరిగి జగన్ గూటికి చేరిన వ్యక్తి.
అంతమాత్రాన వైకాపాలో ఆయనేమీ వైభవ స్థితిలో ఉన్నారని అనుకోవడానికి వీల్లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు పోటీచేసే అవకాశం కూడా పార్టీ ఇవ్వలేదు. కేవలం పెద్దదిక్కు అనే ట్యాగ్ లైన్ తగిలించి.. పక్కన కూర్చోబెట్టడం మాత్రమే ఆయనకు లభించిన గౌరవం. అంతే తప్ప ఆ పార్టీలో ఏ దశలోనూ నిర్ణాయకఅధికారాలు ఉన్న నాయకుడి హోదాలో మైసూరా లేరు గాక లేరు! అలాంటినాయకుడు ఇప్పుడు వైకాపాకు రాజీనామా చేస్తా అంటూ.. అదేదో త్యాగం చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. ఆయన కెరీర్‌కు సంబంధించి వైకాపా అనేది తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. అది ఉంటే ఎంత?పోతే ఎంత?
ఇక రాయలసీమ ఉద్యమం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలంటే.. ఏవో సంకుచిత ప్రయోజనాలు ఉండే కొందరు నాయకులు ఆయన వెంట నిలవాల్సిందే తప్ప.. సీమ ప్రాంతానికి ప్రభుత్వం ద్వారా జరగగల మేలుజరుగుతూనే ఉన్నదని.. పలు అభివృధ్ధి పథకాలు అందుబాటులోకి వస్తున్నాయని నమ్ముతున్న వారెవ్వరూ ఆయనకు మద్దతివ్వరు. ఏదో కొన్నాళ్లు ప్రత్యేక సీమ స్వరాన్ని వినిపించి.. ఆ తర్వాత సద్దుమణిగిపోవడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. అందుకే ఇన్నాళ్లూ రాజకీయంగా అన్నీ అనుభవించిన తర్వాత.. ఇప్పుడు ఏ పదవులైనా దక్కగల స్థితి కూడా చేజారిపోయిన తరువాత.. మైసూరా సీమ పాట పాడడం.. పైన చెప్పుకున్న సామెతనే గుర్తుచేస్తున్నదని పలువురు అంటున్నారు.