Begin typing your search above and press return to search.
ఒక్కరినే తట్టుకోలేరు... ఇద్దరూ కలిసా?
By: Tupaki Desk | 26 Aug 2016 7:40 AM GMTఒకరు గ్రాస్ కోర్టు హీరో.. ఇంకొకరు క్లే కోర్టులో కింగ్.. టెన్నిస్ గ్రాండ్ స్లామ్ చరిత్రలో ఇద్దరూ హేమాహేమీలే. మైదానంలో వారిద్దరూ తలపడితే క్రీడాభిమానుల కళ్లు టీవీలకు అతుక్కుపోతాయి. ఇప్పటికే అర్థమై ఉంటుంది వారెవరో.. ఒకరు స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, మరొకరు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్. ఈ ఇద్దరి మధ్యా ఎన్నో సందర్భాల్లో ఉత్కంఠ పోరు జరిగింది. ఒక్కోసారి ఒక్కొక్కరిది పైచేయి అయింది. కానీ... ఈసారి సీను మారింది.. ఎప్పుడూ ప్రత్యర్థులుగానే పోరాడిన వీరిద్దరూ తొలిసారి కలిసి ఆడుతున్నారు. ఇద్దరూ జంటగాడబుల్సు ఆడబోతున్నారు.
యూరప్ తరఫున డబుల్స్ మ్యాచ్ ఆడేందుకు ఇద్దరూ ఓ వైపు నిలిచి తమ రాకెట్లతో ప్రత్యర్థులకు అదర గొట్టేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ లో యూరప్, రెస్టాఫ్ ది వరల్డ్ జట్ల మధ్య జరగనున్న లావెర్ కప్ టెన్నిస్ పోటీల్లో యూరప్ తరఫున వీరిద్దరూ ఓ జట్టుగా ఆడనున్నారు. ఇదే సమయంలో యూరప్ తరఫున మరో జంటగా, వరల్డ్ నంబర్ వన్ జకోవిచ్, బ్రిటన్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రేలను కూడా బరిలోకి దించాలని టోర్నీ నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే... సమకాలీన టెన్నిస్ లో తిరుగులేని ఆటగాళ్లుగా ఉన్న ఈ నలుగురు ఆటగాళ్లు యూరప్ తరఫున బరిలో దిగితే రెస్టాఫ్ ది వరల్డ్ జట్టు కుదేలవడం ఖాయమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అన్నిటికీ మించి ఫెదరర్, నాదల్ లు జంటగా డబుల్సు ఆడితే ఆ మ్యాచ్ కు అభిమానులు పోటెత్తుతారని భావిస్తున్నారు. ఎప్పుడూ ప్రత్యర్థులుగానే ఆడిన వీరు తొలిసారి జంటగా కోర్టులో దిగితే అభిమానులకు పండగే.. అంతేకాదు... వారిని ఒక్కొక్కరిగానే తట్టుకోవడం కష్టం, అలాంటిది ఇద్దరూ కలిసి రంగంలోకి దిగితే ఎదురు నిలిచేవారే ఉండరేమో?