Begin typing your search above and press return to search.
ఆయనది తెనాలి కాదా...కొత్త రూటే మరి...?
By: Tupaki Desk | 15 April 2022 11:30 PM GMTఅదేదో తెలుగు సినిమాలో మీది తెనాలీ. మాది తెనాలీ అని ఇక కామెడీ డైలాగ్ ఉంటుంది. ఇపుడు ఏపీ రాజకీయాల్లో చూస్తే ఒక కీలక నాయకుడి రాజకీయ ప్రస్థానానికి ఊతమిచ్చిన తెనాలిని ఆయన కాదనుకుంటున్నారా అన్న డిస్కషన్ అయితే హాట్ హాట్ గా సాగుతోంది. నాది తెనాలి కాదు అని ఆయన బయటకు చెప్పకపోయినా మ్యాటర్ అయితే అలాగే ఉంది అంటున్నారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరూ అంటే జనసేనలో నంబర్ టూ అయిన నాదెండ్ల మనోహర్.
ఆయన 2004లో వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ తరఫున ఫస్ట్ టైమ్ గుంటూరు జిల్లా తెనాలి నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక 2009 ఎన్నికల్లోనూ రెండవమారు గెలిచారు. ఏకంగా డిప్యూటీ స్పీకర్, స్పీకర్ కూడా అయ్యారు. 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడితే 2019 ఎన్నికల్లో జనసేన తరఫున బరిలో దిగి ఓటమి పాలు అయ్యారు. మొత్తానికి తెనాలి ఆయన్ని రెండు సార్లు గెలిపించి మరో రెండు సార్లు ఓడించింది.
దీంతో 2024 ఎన్నికలకు నాదెండ్ల తెనాలికి గుడ్ బై అనేస్తున్నారా అన్న చర్చ జనసేనలో సాగుతోందిట. దాంతో పాటు ఆయన విజయవాడలో వేరే సీటుని చూసుకున్నారు అని కూడా డౌట్లు పడుతున్నారుట. హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్న నాదెండ్ల ఉంటే మంగళగిరి పార్టీ ఆఫీస్ లేకపోతే తాను కొత్తగా ఎంచుకున్న విజయవాడ సీట్లో కనిపిస్తున్నారుట. అక్కడే టూర్లు కూడా వేస్తున్నారుట.
ఇక ఆయన తెనాలి రావడం బాగా తగ్గినేశారు అని అంటున్నారు. ఆయన చివరి సారిగా తెనాలి వచ్చింది కొల్లిపర మండలంలో వర్షాలకు కొట్టుకుపోయిన పంట పొలాలను పరిశీలించడానికి వచ్చారని పార్టీ వర్గాల భోగట్టా. మరి తనను డిప్యూటీ స్పీకర్, స్పీకర్ గా ఎంపిక కావడానికి ఎంతో కృషి చేసిన తెనాలి అంటే ఎందుకు అంతలా మోజు తగ్గింది అంటే దానికి చాలా రీజన్స్ చెబుతున్నారు.
తెనాలిలో ఆయన వర్గంలోని ముఖ్యనేతలు ఇపుడు ఇతర పార్టీలలో జంప్ అయిపోయారుట. అలాగే తెనాలిలో గెలుపు అవకాశాలను కూడా బేరీజు వేసుకున్న మీదటనే విజయవాడలో సేఫ్ జోన్ వైపు ఆయన చూపు మళ్ళింది అంటున్నారు. ఇక ఈ మధ్యనే నాదెండ్ల పుట్టిన రోజు వస్తే తెనాలికి ఆయన వస్తారని క్యాడర్ చాలా ఆసక్తిగా ఎదురుచూశారుట. ఆయన రాకపోవడంతో నిరాశ చెందారని అంటున్నారు.
అయితే మరికొందరు మాత్రం అదంతా వట్టి ప్రచారమే అంటున్నారు. నాదెండ్ల రాజకీయంగా బిజీగా ఉండడం వల్లనే తెనాలి తరచూ రాలేకపోతున్నారని, ఆయన వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తారని, తెనాలి నుంచి గెలవడం ఖాయమని ఆయన అనుచరులు అంటున్నారు. సో నాదెండ్ల మీది తెనాలీ నాది తెనాలి రాజకీయ కధ ఇప్పటికి సస్పెన్స్. అసలు మ్యాటర్ తెలియాలీ అంటే 2024 వరకూ వెయిట్ చేయాల్సిందే.