Begin typing your search above and press return to search.

బాబు పవన్ భేటీలో నాదెండ్ల మనోహర్ మిస్సింగ్ అందుకేనా....?

By:  Tupaki Desk   |   8 Jan 2023 7:54 AM GMT
బాబు పవన్ భేటీలో నాదెండ్ల మనోహర్ మిస్సింగ్ అందుకేనా....?
X
జనసేనాని పవన్ కళ్యాణ్ వెంట ఎపుడూ కనిపించే రెండవ నాయకుడు నాదెండ్ల మనోహర్. ఆయన ఆ పార్టీకి డిప్యూటీ. పవన్ సైతం ఆయనకే ఎక్కువ విలువ గౌరవం ఇస్తారు. ఇద్దరూ కలిసే ఎక్కడికి అయినా వెళ్తారు. 2019 ఎన్నికలకు ముందు లక్నోకు వెళ్ళి మరీ ఈ ఇద్దరూ మాయవతిని కలసి పొత్తు కుదుర్చుకున్నారు. ఇక విజయవాడలో విశాఖలో పవన్ తో పాటు నోవెటెల్ హొటెల్ లో నాదెండ్ల కనిపించారు.

అంతే కాదు విశాఖ రుషికొండ బీచ్ లో ఇద్దరూ కలసి కెరటాలతో ఆడుతూ సందడి చేశారు. పవన్ రాజకీయానికి నాదెండ్ల తోడుగా ఎపుడూ ఉంటూ వస్తున్నారు. అలాంటిది ఫస్ట్ టైం నాదెండ్ల మనోహర్ పవన్ వెంట లేకపోవడం విశేషమే కాదు అంతా ఆశ్చర్యంగా చూస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ వెంట ఉండాల్సిన డిప్యూటీ నాదెండ్ల మిస్సింగ్ అంటున్నారు.

అదెలా అంటే హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ ఒంటరిగానే వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతలే ఏకాంత చర్చలు జరిపారు. మధ్యలో మూడవ వ్యక్తి అంటూ ఎవరూ లేకపోవడం విశేషం. పవన్ కళ్యాణ్ తో ఎపుడూ కనిపించే నాదెండ్ల లేకపోవడం ఇంకా విశేషంగానే చూస్తున్నారు. దీని మీద రకరకాలైన కామెంట్స్ వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ వెంట ఆఖరుకు ప్రధాని నరేంద్ర మోడీ భేటీలోనూ కనిపించిన నాదెండ్ల ఇపుడు మాత్రం ఎందుకు లేరు అని సవాలక్ష సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు అన్నది నాదెండ్లకు ఇష్టం లేదా అన్నది కూడా ఇపుడు హాట్ టాపిక్ గా చర్చకు వస్తోంది. అలా కనుక ఇష్టం లేకపోబట్టే ఆయన దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు.

అయిఏ నాదెండ్ల మనోహర్ అయితే విశాఖలో ఉన్నారని అంటున్నారు. ఆయన శ్రీకాకుళంలోని రణస్థలంలో ఈ నెల 12న జనసేన ఆద్వర్యంలో నిర్వహించే యువశక్తి మీటింగ్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు అని చెబుతున్నారు. అయితే విశాఖ హైదారాబద్ కి ఫ్లైట్ లో ఎంత దూరం జస్ట్ గంట మాత్రమే కదా అన్న వారూ ఉన్నారు. జనసేన అధినాయకుడు తానుగా చంద్రబాబుతో చాన్నాళ్ళ తరువాత భేటీ అవుతూంటే అది రాజకీయంగా చాలా ఇంపార్టెంట్ అని కూడా అంటున్నారు.

మరి అంతటి ప్రాధాన్యత కలిగిన సమావేశంలో నాదెండ్ల కచ్చితంగా కనిపించాల్సి ఉందని కూడా అంటున్నారు. కానీ ఆయన రాలేదు అంటే ఆయనకు ఈ పొత్తు పట్ల పెద్దగా ఆసక్తి లేదని అంటున్నారు. అదే సమయంలో ఆయన బీజేపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నారని కూడా ప్రచారం సాగుతోంది. మరి నాదెండ్ల విముఖంగా ఉండబట్టే ఈ భేటీకి మిస్స్ అయ్యారని అంటున్నారు. ఏది ఏమైనా వాస్తవాలు తొందరలో బయటపడతాయి కానీ పవన్ పక్కన నాదెండ్ల లేకపోవడం మాత్రం జనసైనికులకు కూడా ఆశ్చర్యంగానే ఉంది అంటున్నారు.