Begin typing your search above and press return to search.
ఇందిరా గాంధీ కాళ్ళ పై పడ్డారు ఎన్టీఆర్: నాదెండ్ల
By: Tupaki Desk | 20 Jan 2019 10:53 AM GMTఎన్టీఆర్ జీవితంపై బాలయ్య బయోపిక్ తీశాడు. అది కాస్తా తుస్సుమంది. కానీ ఎన్టీఆర్ జీవితంపై ఎవ్వరూ రాయని, ఎవ్వరికీ తెలియని విషయాల్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చెప్తూ సరికొత్త బయోపిక్ కు తెరతీశారు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు. బయోపిక్ రిలీజ్ కు ముందునుంచీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన నాదెండ్ల.. ఇప్పుడు ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీని ఎన్టీఆర్ ఎదిరించారని అందరూ చెప్పుకుంటారని.. కానీ ఆయన ఒకానొక సమయంలో ఇందిరాగాంధీ కాళ్ల పై పడ్డారని చెప్పారు నాదెండ్ల. ఆ సమయంలో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పారు నాదెండ్ల భాస్కరరావు.
“ఎన్టీఆర్‌ని దించి నేను ముఖ్యమంత్రి అయ్యాను. అయితే.. ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు కలిసి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లారు. వాళ్లు.. ఎన్జీరంగా, కేఎల్ ఎన్ ప్రసాద్, నాయుడమ్మ. ఈ ముగ్గురూ ఎన్టీఆర్ కు సాయం చేసేందుకు మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత పీవీ నరసింహారావు దగ్గరకు వెళ్లారు. ఆయన మాట్లాడి.. ఇందిరాగాంధీతో ఎన్టీఆర్ కు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌లో దాదాపు ఇందిరా గాంధీ కాళ్లపై పడినంత పని చేశారు ఎన్టీఆర్. అప్పటినుంచి ఇందిరాగాంధీని కానీ, పీవీని కానీ ఎన్టీఆర్ ఏనాడూ విమర్శించలేదు. ఆ తర్వాతే ఇందిరాగాంధీ ఆర్డర్ వేయడం, గవర్నర్ ఆమె మాటకు తలొగ్గి పనిచేయడం, ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాపై పీవీకి కోపం ఉంది. ఆ కోపాన్ని ఎన్టీఆర్ ని మళ్లీ గద్దెనెక్కించడం ద్వారా తీర్చుకున్నారు పీవీ” అని అన్నారు నాదెండ్ల. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.