Begin typing your search above and press return to search.
జగన్ బ్రదర్ లా నాదెండ్ల వ్యవహరించారా?
By: Tupaki Desk | 21 Oct 2015 1:43 PM GMTఇంటికి ఎవరైనా వచ్చి ఆహ్వాన పత్రాన్ని ఇస్తుంటే.. ఇష్టం లేకున్నా ముఖం మీద నవ్వు పులుముకొని ఓకే చెప్పేస్తాం. అంతేకాదు.. ఇంటికి వచ్చిన వాడు శత్రువు అయినా సరే.. శత్రుత్వాన్ని వదిలేసి అప్యాయంగా పలుకరించి మర్యాదలు చేయటం మామూలే. కానీ.. ఇలాంటి వాటికి తాను భిన్నమన్న విషయాన్ని తాజాగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ తన చేతల ద్వారా స్పష్టం చేయటం తెలిసిందే.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం అందించటానికి ఏపీ మంత్రుల బృందం ప్రయత్నం చేయటం.. ఆయన రానని చెప్పటమే కాదు.. ఆహ్వానపత్రాన్ని ఇచ్చేందుకు తన ఇంటికి రావొద్దంటూ తెగేసి చెప్పటం తెలిసిందే.
జగన్ వైఖరిపై పలువురు విమర్శలు చేశారు. శంకుస్థాపనకు వెళ్లటం.. వెళ్లకపోవటం జగన్ ఇష్టమని.. కాకుంటే ఇంటికి వచ్చి ఆహ్వానిస్తానని అడిగిన వారిని ఇంటికి రావొద్దని చెప్పటం ఏమిటంటూ పలువురు విమర్శించారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ శంకుస్థాపన ఆహ్వానాన్ని అందించేందుకు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఇంటికి వెళ్లిన తెలుగుదేశం ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ కు చేదు అనుభవం ఎదురైందని చెబుతున్నారు.
ఆహ్వానపత్రం ఇచ్చేందుకు నాదెండ్ల ఇంటికి వెళ్లిన జనార్దన్ ను ఇంట్లోకి ఆహ్వానించకుండా గన్ మెన్ కు ఇవ్వాలని నాదెండ్ల చెప్పారని చెప్పటంతో వారు ఆహ్వానపత్రాన్ని ఇచ్చేసి వెళ్లారని చెబుతున్నారు. ఈ వ్యవహారం మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం నేతలు అగ్రహం వ్యక్తం చేయటంతోపాటు..జగన్ బ్రదర్ లా వ్యవహరించారేంటూ విమర్శలు చేయటం కనిపించింది.
మరోవైపు.. ఈ వ్యవహారంపై నాదెండ్ల వివరణ ఇస్తూ.. తన ఇంటికి ఎమ్మెల్సీ జనార్దన్ వస్తారన్న సమాచారంతో తాను బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఎదురుచూశానని.. ఇంట్లోకి రానీయకుండా గన్ మెన్లకు ఆహ్వానపత్రాన్ని ఇచ్చి వెళ్లాలంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ ఆయన వివరణ ఇస్తున్నారు. ఇంతమంది అతిధులకు ఆహ్వానాలు ఇచ్చినా ఎదురుకాని అనుభవం తెలుగుదేశం నేతలకు నాదెండ్ల ఇష్యూలోనే ఎందుకు ఎదురైనట్లు..?