Begin typing your search above and press return to search.
వైసీపీ నేతలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాదెండ్ల!
By: Tupaki Desk | 9 Dec 2022 9:48 AM GMTపవన్ ఎన్నికల ప్రచార రథం.. వారాహి వాహనంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు వైసీపీ జెండా రంగులు వేసి హైకోర్టు చేత చీవాట్లు తిన్న వైసీపీ నేతలు కూడా పవన్ గురించి వ్యాఖ్యలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు.
పవన్ వాహనం రంగుల గురించి, నిబంధనల గురించి వైసీపీ నేతలు మాట్లాడంపై నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. తాజాగా ఆయన విశాఖలో ఐటీ విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాదెండ్ల వైసీపీ నేతలపై మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ ప్రచార రథం 'వారాహి' నిబంధనలకు అనుగుణంగా సిద్ధం అవుతోందని తెలిపారు. నిబంధనలు పరిశీలించకుండా రవాణా శాఖ వారు అనుమతి ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. ఏ మాత్రం ఆలోచన లేకుండా విమర్శలు చేయడం వైసీపీ నేతల బుద్ధిరాహిత్యాన్ని, మూర్ఖత్వాన్ని తెలుపుతోందని నాదెండ్ల మనోహర్ నిప్పులు చెరిగారు.
అయినా ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రభుత్వ పాఠశాలలకు ఇష్టానుసారం పార్టీ రంగులు వేసుకునే వైసీపీ నేతలకు నిబంధనలు ఏం తెలుస్తాయని విమర్శించారు. జనసేన పార్టీ ఎల్లప్పుడు నిబంధనల ప్రకారం మాత్రమే నడుచుకుంటుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజాహితంగా, చట్టానికి లోబడే ఉంటుందని స్పష్టం చేశారు.
వైసీపీ నేతలకు వ్యక్తిగత విమర్శలు చేయటం అలవాటుగా మారిందని నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. అలాంటి వారికి పవన్ కల్యాణ్ ఒక్కసారి చెప్పు చూపిస్తే భయపడ్డారని, అది నిజాయితీకి ఉన్న దమ్ము అని తెలిపారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఏపీఎస్‌ఆర్టీసీ కాస్త వైస్సార్సీపీ ఆర్టీసీగా మారిపోయిందని నాదెండ్ల తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ బస్సులు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. నిబంధనలు పట్టించుకోని వారికి.. నిబంధనల గురించి చెప్పే అర్హత ఉందా? అని నిలదీశారు.
కాగా ఏపీ రాష్ట్ర విబజనపై వైసీపీ ముఖ్య నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను నాదెండ్ల మనోహర్ తీవ్రంగా ఖండించారు. సజ్జల రెండు రాష్ట్రాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు నెలల్లో ఏపీ ఆస్తులు తెలంగాణాకు ఎందుకు కట్టబెట్టేశారని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.
ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలసి పోతేæ బాగుటుందని ప్రజలను అయోమయస్థితిలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒత్తిడిలో ఉన్నారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. అలాగే రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని వైసీపీ నేతలు మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.