Begin typing your search above and press return to search.
నాదెండ్ల డేర్!... బాలయ్యకు నోటీసులు!
By: Tupaki Desk | 29 Dec 2018 12:26 PM GMTతెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రుల ఆరాధ్య నటుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కున్న ఎన్టీఆర్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు... రెండింటికీ ఇబ్బందులు తప్పేలా లేవన్న వాదన వినిపిస్తోంది. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇప్పటికే వివాదాల్లో మునిగి తేలుతుండగా... ఇప్పుడు ఆ వంతు ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తున్న *ఎన్టీఆర్*కు వచ్చేసింది. ఈ రెండు చిత్రాలు భిన్న నేపధ్యాన్ని ఎంచుకోగా... ఏ ఒక్క చిత్రంలోనూ ఎన్టీఆర్ పూర్తి స్థాయి జీవితాన్ని చూపే అవకాశాలు లేవు. ఈ విషయాన్ని వర్మ బహిరంగంగానే ప్రకటించారు కూడా. *ఎన్టీఆర్* నిర్మాత బాలయ్య టీడీపీలో ఉన్న నేపథ్యంలో టీడీపీకి ఏమాత్రం నష్టం చేకూర్చని రీతిలో ఎన్టీఆర్ జీవితంలోని కీలక ఘట్టమైన వైశ్రాయి తిరుగుబాటును వదిలేస్తున్నారని, అయితే తాను మాత్రం ఆ వైశ్రాయి ఘటనను కీలక ఘట్టంగా చేసుకునే చిత్రాన్ని తెరెకెక్కిస్తున్నట్లుగా వర్మ ప్రకటించారు.
ఇక తన చిత్రం ఇతివృత్తం అయిన వెన్నుపోటును ప్రొజెక్ట్ చేస్తూ... వర్మ మొన్న ఓ పాటను రిలీజ్ చేయగా... దాని పై టీడీపీ భగ్గుమంది. వర్మ పై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఏకంగా కేసు కూడా పెట్టారు. అయితే వర్మ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండానే... ఎస్వీకి లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ వివాదం మున్ముందు మరింత ముదిరే అవకాశాలు లేకపోలేదు. టీడీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో అసలు వర్మ తీస్తున్న చిత్రం విడుదలకు నోచుకుంటుందా? అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే... ఇప్పుడు బాలయ్య తన తండ్రి పాత్రలో కనిపిస్తూ తెరకెక్కిస్తున్న *ఎన్టీఆర్* పై వివాదం మొదలైంది. సినీ నటుడిగా జైత్ర యాత్ర కొనసాగిస్తున్న ఎన్టీఆర్ తెలుగు ఆత్మ గౌరవ నినాదాన్ని అందుకుని టీడీపీని స్థాపించి కేవలం 9 నెలల వ్యవధిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేసి టీడీపీని గద్దెనెక్కించడంతో పాటు తాను సీఎం అయ్యారు. అయితే ఆ సమయంలో పార్టీలో ఉన్న కీలక నేతల్లో ఒకరైన నాదెండ్ల భాస్కరరావు... ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సందర్భాన్ని ఆసరా చేసుకుని ఎన్టీఆర్ సర్కారును కూల్చేసి తాను సీఎం పీఠమెక్కారు. అంటే ఎన్టీఆర్ కు మొదట వెన్నుపోటు పొడిచింది నాదెండ్లనే అన్న మాట.
ఇదే ఘటనను హైలెట్ చేస్తూ బాలయ్య సినిమా రూపొందుతున్నట్లుగా సమాచారం. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఈ ఘటనను ఎలివేట్ చేయడం ద్వారా చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీకి మైలేజీ వస్తుందన్నది బాలయ్య భావన. అయితే ఇప్పుడు నాదెండ్ల భాస్కరరావు ఎంట్రీ ఇచ్చేసి బాలయ్యకు చుక్కలు చూపించేందుకు సిద్ధమయ్యారు. నిన్ననే మీడియా ముందుకు వచ్చిన నాదెండ్ల... బాలయ్య తీస్తున్న సినిమాను తనకు చూపించిన తర్వాతే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. తనను విలన్ గా చూపించే యత్నం చేస్తే... న్యాయ పోరాటానికి కూడా వెనుకాడేది లేదని కూడా ఆయన తేల్చేశారు.
తాజాగా ఈ రోజు బాలయ్య, ఆ సినిమా డైరెక్టర్ గా పనిచేస్తున్న క్రిష్ జాగర్లమూడికి నాదెండ్ల లీగల్ నోటీసులు జారీ చేశారు. తనకున్న సమాచారం ప్రకారం సినిమాలో తనను విలన్ గా చూపిస్తున్నారని, తననున నెగెటివ్ గా చేపిస్తే సహించేదే లేదని అల్టిమేటం జారీ చేసిన నాదెండ్ల... బాలయ్య, క్రిష్ తో పాటు ఏకంగా సెన్సార్ బోర్డు సభ్యులకు కూడా నోటీసులు పంపారు. మరి ఈ నోటీసులకు బాలయ్య అండ్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Watch Here : Lakshmi Parvathi Revealed Top Secret About Sr NTR