Begin typing your search above and press return to search.
జగన్ సర్కార్ మీద పవన్ కి అవే ఫిర్యాదులట...
By: Tupaki Desk | 29 Oct 2022 8:47 AM GMTఏపీలో అభివృద్ధి లేదు అని విపక్షాలు అంటున్నాయి. ఇపుడు జనసేన మరో కార్యక్రమం తీసుకుంది. కేంద్రం మంజూరు చేసిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తి చేయలేక గత మూడున్నరేళ్ల కాలంలో చేతులెత్తేసిన సర్కార్ జగన్ దే అంటూ జనసేన ఘాటైన విమర్శలు చేసినై. గత మూడేళ్లలో కేంద్రం టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం ఏకంగా 22వేల కోట్లకు పైగా నిధులు ఏపీకి మంజూరు చేస్తే అందులో నుంచి ఏపీ సర్కార్ ఉపయోగించుకున్నది కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలే అని జనసేన పీయేసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
దానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు ఏపీ సర్కార్ మ్యాచింగ్ గ్రాంట్స్ ని సమకూర్చలేక చేతులెత్తేసిందని ఆయన చెప్పడం విశేషం. దీని వల్ల ఏపీలో 1.19 లక్షల టిడ్కో గృహ నిర్మాణాలు పూర్తికాలేదని ఆయన లెక్కలతో సహా చెప్పుకొచ్చారు. అదే టైంలో టిడ్కో ఇళ్ళ కోసం లబ్దిదారులను ఎంపికచేసి బ్యాంకులు రూ. 4,107 కోట్ల రుణాలు ఇవ్వడానికి ముందుకువచ్చాయి. కానీ దానిలో రూ.1,602 కోట్లు మాత్రమే మంజూరుకాగా చివరికి కేవలం రూ.1,372 కోట్లు మాత్రమే లబ్దిదారుల చేతికి అందాయని ఆయన వరించారు.
ఈ టిడ్కో ఇళ్ళను గత ఏడాది జూన్ 21 నాటికల్లా పూర్తి చేసి 18,063 మంది లబ్దిదారులకు అందచేస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించి కూడా ఈ రోజుకీ పూర్తి చేయలేకపోయిందని ఆయన అన్నారు. దాని వల్ల లబ్దిదారులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు గానూ వడ్డీలు చెల్లిస్తూ ఆర్ధిక భారాన్ని మోస్తున్నారని ఆయన అన్నారు.
ఏపీలో మూడున్నరెళ్ళు గడచినా జగన్ సర్కార్ టిడ్కో ఇళ్లతో సహా ఏ ఒక్క గృహ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయిందని నాదెండ్ల విమర్శించారు. ఏపీలో ఇళ్ల నిర్మాణం లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని, పవన్ కళ్యాణ్ ఎక్కడ జనవాణి కార్యక్రమం నిర్వహించినా కూడా పెద్ద ఎత్తున సాధారణ ప్రజల నుంచి ఇళ్ల మీదనే ఫిర్యాదులు వస్తున్నాయని నాదెండ్ల చెప్పారు.
ఏపీలో పేదలు ఇళ్ళు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నది దీనిని బట్టి తెలుస్తోందని, ప్రభుత్వం మాత్రం మాటలు తప్ప చేతలలో ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉందని ఆయన విమర్శించారు.
ఒక వైపు కేంద్రం నిధులు ఇస్తోంది. బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అంటున్నారని, అలాగే అప్పులు కూడా పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయిందని, దీని వల్ల పేదలు ఏపీలో సొంత ఇళ్లు లేక అద్దెలు కట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు.
కేంద్రం కూడా ఏపీలో తాము ఇస్తున్న నిధులు ఏమవుతున్నాయన్నది చూడాల్సి ఉంటుందని, మరి వారు ఏం చేస్తున్నారో తెలియడంలేదని నాదెండ్ల అనడం విశేషం. మొత్తానికి ఏపీ సర్కార్ కేంద్ర నిధులకు మ్యాచింగ్ నిధులు సమకూర్చలేకపోతోందని చెబుతూనే మరో వైపు కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్ళిస్తున్నారని ఘాటైన ఆరోపణ చేశారు. మధ్యలో కేంద్రాన్ని కూడా ఇరికించారు. చూడాలి ఆయన విమర్శలకు వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.