Begin typing your search above and press return to search.

జ‌న‌సేన బ‌లం 12 శాతం.... ఇది నాదేండ్ల లెక్క‌!

By:  Tupaki Desk   |   7 Dec 2022 11:30 PM GMT
జ‌న‌సేన బ‌లం 12 శాతం.... ఇది నాదేండ్ల లెక్క‌!
X
ఏపీలో రాజ‌కీయాల‌న్నీ ఇప్పుడు జ‌న‌సేన‌, ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చుట్టూనే తిరుతున్నాయి.  రాబోయే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ బ‌ల‌మెంత‌, ఆ పార్టీ ప్ర‌భావం ఎంత అనేదానిపైన ఎక్క‌డ చూసిన చ‌ర్చోప‌చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇలా ఉండగా రాష్ట్రంలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు పెడితే జ‌న‌సేన 12శాతం ఓట్లు సంపాదిస్తుంద‌ట‌.  అది కూడా ఆ పార్టీ ఛైర్‌ప‌ర్స‌న్ నాదేండ్ల మ‌నోహ‌ర్ లెక్క‌లేసి మ‌రీ చెబుతున్నార‌ట‌.  జ‌న‌సేనానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌రువాత ఆ పార్టీలో చ‌క్రం తిప్పుతున్న‌ది ఇప్పుడు నాదేండ్ల మ‌నోహ‌ర్ మాత్ర‌మే. ఆయ‌న పార్టీ క్షేత్ర‌స్థాయిలో నిర్మాణం మొద‌లు రాబోయే ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహం వ‌ర‌కు చాలా వేగంగా పావులు క‌దుపుతున్నారు.

త‌మ‌కు రాబోయే ఓట్ల శాతం అంచ‌నా ప్రాతిప‌ద‌క‌నే రాబోయే ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహం అనుస‌రించాల‌నేదానిపైన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, టీడీపీతో దోస్తీ క‌డుతుంద‌ని ప్రచారం జ‌రిగింది. అయితే ఇటీవ‌ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ విశాఖ‌ప‌ట్నం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆయ‌న్ను క‌లిశారు.

ఆ త‌రువాత రాజ‌కీయం మారిపోయింది. టీడీపీతో జ‌న‌సేన క‌ల‌వ‌డానికి పీఎం మోడీ మోకాల‌డ్డు వేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.  అక్క‌డ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో మోడీ ఏం మాట్లాడ‌ర‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. అక్క‌డ మాట్లాడిన విష‌యాలు తెలిసింది జ‌న‌సేలో ఇద్ద‌రికే. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నాదేండ్ల మ‌నోహ‌ర్‌లు మాత్ర‌మే.

ఇప్పుడు టీడీపీతో జ‌త‌క‌ట్ట‌కుండా ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి ఒంట‌రిగా పోటీ చేస్తే వ‌చ్చే లాభ‌న‌ష్టాలేంటీ, టీడీపీతో క‌లిస్తే ఒరిగేదేమిటీ అనే దానిపైన జ‌న‌సేన మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. మ‌రోవైపు ఏదో ఒక అద్భుతం జ‌రిగి జ‌న‌సేన త‌మ పార్టీతో పొత్తు కుదుర్చుకోక త‌ప్ప‌దా అని టీడీపీ ఇంకా ఆశ‌లు పెట్టుకునే ఉంది. అయితే పైకి మాత్రం తాము ఒంటరిపోరుకే సిద్ద‌మ‌ని టీడీపీ మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నా జ‌న‌సేనాని కోసం ఆ పార్టీ నేత‌లు గుమ్మం వ‌ద్ద ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు.

ఇలా ఉండ‌గా జ‌న‌సేనాని ఇప్పుడు త‌న వ్యూహాన్ని పూర్తిగా మార్చ‌బోతున్నార‌ని ప్ర‌చారం జరుగుతోంది. టీడీపీతో జ‌తక‌ట్ట‌కుండా మోడీ వేసిన ఎత్తుగ‌డ‌కు ఆయ‌న పైఎత్తు వేసిన‌ట్లు తెలిసింది. తమ పార్టీకి 12శాతం ఓటుబ్యాంకు రాబోతోంద‌ని ఆ పార్టీ అంచ‌నా వేస్తోంది. ఈ నేప‌థ్యంలో రాబోయే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసినా రాష్ట్ర‌మంత‌టా కాకుండా త‌మ‌కు బాగా బ‌ల‌మైన స్థానాలు ఏంటీ ఎక్క‌డ జ‌న‌సేన గెలుపు అవ‌క‌శాలు దండిగా ఉన్నాయి అనే స్థానాల‌ను గుర్తిస్తోంది. అక్క‌డ జ‌న‌సేనాని ఎక్కువ‌గా కేంద్రీకృతం చేసి ఎక్కువ సార్లు అక్క‌డే జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌టించి పార్టీని గెలుపుతీరాల‌కు చేర్చాల‌ని చూస్తున్నార‌ట‌.

అయితే ఇది ఎంత వ‌ర‌కు సాధ్య‌మ‌వుతుంది అనేది వేచి చూడాలి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట చీల్చ‌నివ్వ‌ను అని చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒంట‌రి పోరు ద్వారా వ్య‌తిరేక ఓటును చీల్చ‌కుండా ఎలా చేయ‌గ‌లుగుతార‌నే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది. ఏమైన‌ప్ప‌టికీ వీట‌న్నిటిపైన జ‌న‌సేనాని ఎలాంటి అడుగులు వేయ‌బోతున్నార‌నేది స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.