Begin typing your search above and press return to search.
ఆధారాలున్నాయిః బాబు డబ్బా బోగస్
By: Tupaki Desk | 18 Oct 2016 6:11 AM GMTఅతి ప్రచారం నిర్వహించుకుంటే ఏం జరుగుతుందో ఏపీ ప్రభుత్వానికి ఇపుడు తెలిసి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. విశాఖలో ఇటీవల నిర్వహించిన పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 5 లక్షల కోట్ల పెట్టుబడులు - 10 లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ స్ఠాయిలో నిధుల వరద కానరాకపోవడంతో ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తరచుగా విమర్శలు చేసే వారికంటే ఆచితూచి మాట్లాడే నాయకులు సైతం బాబు ప్రచారం చేసుకున్న రీతిలో సీన్ లేదని అంటున్నారు. సౌమ్యుడైన రాజకీయవేత్తగా పేరున్న మాజీ సభాపతి - ఏపీపీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ తాజాగా చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ పై తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో నిజం కాదన్నారు.
విశాఖ జిల్లాలో నిర్వహించిన పార్ట్ నర్ షిప్ సమ్మిట్ బోగస్ అని మనోహర్ విమర్శించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను అందించారు. ఈ సమ్మిట్ కు ప్రభుత్వం అనవసర ఖర్చు చేసిందని - కోట్ల రూపాయల ప్రజాధనానికి లెక్కలు లేకుండా చూసేందుకు జీవో కాకుండా మెమోల ద్వారా ఖర్చు చేసిన విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఇంత ఖర్చుచేస్తే జరిగిన మేలు ఏమిటని మనోహర్ ప్రశ్నించారు. సమావేశాలకు అయిన ఖర్చుల లెక్క సుమారు 28 కోట్ల రూపాయలని మనోహర్ వెల్లడించారు. 41 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరయ్యారని రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ప్రకటించిందని, అయితే 600 మంది పాల్గొన్నారని వెలగపూడిలో ఆర్థిక మంత్రి చెప్పారని మనోహర్ అన్నారు. ఈ లెక్కలకు అర్ధం ఏమిటని నిలదీస్తూ.. సుపరిపాలన - పారదర్శకత - బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్ మెంట్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
విశాఖ జిల్లాలో జరిగిన సమ్మిట్ లో 361 ఎంవోయులు కుదిరాయని - వీటిద్వారా 4,76,878 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపికి వస్తాయని, దీంతో 10,27,121 మందికి ఉపాధి లభిస్తుందని టీడీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసిందని మనోహర్ అన్నారు. కానీ ఈ సమ్మిట్ జరిగి ఇప్పటికి 10నెలలు పూర్తయిన సందర్భంగా ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతవరకు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని తేలిందని మనోహర్ అన్నారు. స్వయానా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న పరిశ్రమల శాఖపై సేకరించిన వివరాలిలావుంటే దీని అర్థమేమిటన్నారు. సమ్మిట్ లో నాట్య కార్యక్రమానికే కోటి రూపాయలు ఖర్చు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి బయటపడుతుందనే ఈ వివరాలను గోప్యంగా ఉంచుతోందన్నారు. ప్రజాధనం దుర్వినియోగంపై విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/