Begin typing your search above and press return to search.
జనసేన రౌడీ సేనట...ఎలా... హౌ....?
By: Tupaki Desk | 21 Nov 2022 4:09 PM GMTజనసేనను జనసున్నా అని సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ అదేనా పనిగా ట్రోల్స్ చేస్తారు. సైకో సేన అని వారే అంటారు. సరే విమర్శలకు సోషల్ మీడియాలో అర్ధం పర్ధం ఉండదు. అక్కడ ఎవరైనా ట్రోల్స్ బారిన పడాల్సిందే. ఎందుకంటే ఇది స్వేచ్చా భారతం. ఎవరు ఎంతలా అరచి గీపెడితే అంతలా సౌండ్ వస్తుందనుకునే వారుంటారు.
అయితే బాధ్యత గల నాయకులు మాత్రం ఈ విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడాల్సిందే. కానీ ఏపీ రాజకీయాల్లో వాటిని ఆశించడం అంటే అత్యాశగానే అంతా అంటున్నారు. ఏడు పదుల వయసులో కూడా చంద్రబాబు కర్నూల్ సభలో సహనం కోల్పోయారు. మరోటి ఏంటి అంటే ఫైర్ బ్రాండ్ అనిపించుకోవడం ఒక క్వాలిఫికేషన్ అని కూడా నేతాశ్రీలు భావిస్తున్నారు.
పంచ్ డైలాగులు పేల్చడంలో తృతీయ శ్రేణి నేతలకు ధీటుగా అగ్ర నేతలు కూడా పోటీ పడుతున్నారు. ఇక సీఎం గా ఉన్న జగన్ మీడియాతో మాట్లాడేది లేదు. ఆయన ట్వీట్లు కూడా చేయరు, పత్రికా ప్రకటనలు అంతకంటే ఉండవు. మరి ఆయన రియాక్షన్ ఎలా అంటే ఆయన వరసబెట్టి పాల్గొంటున్న సభలలోనే తన భావాలను చెబుతారు.
ఆయన తన ప్రసంగాలలో అప్పటిదాకా జరిగిన వాటిని గుదిగుచ్చి తనదైన స్టైల్ లో విమర్శలు చేస్తూంటారు. అలా నర్సాపురం సభ నుంచి ఆయన తెలుగుదేశం జనసేనలకు కొత్త పేర్లు పెట్టి హాట్ హాట్ గా కామెంట్స్ చేసారు.
అందులో తెలుగు బూతుల పార్టీగా టీడీపీని ఆయన విమర్శిస్తే జనసేనను ఆయన రౌడీ సేన అనేశారు. అలాగే యధాప్రకారం పవన్ కళ్యాణ్ణి దత్తపుత్రుడు అన్న ట్యాగ్ తో నిందించారు. సరే దీని మీద జనసేన ఊరుకుంటుందా. వెంటనే అటు నుంచి రియాక్షన్ వచ్చేసింది.
జనసేనలో నంబర్ టూ గా ఉన్న నాదెండ్ల మనోహర్ జనసేన ఎలా రౌడీ సేన అయింది జగన్ గారూ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించేశారు. మీ సొంత జిల్లా కడపలో వరదబాధితులను గాలికొదిలేసినందుకా. వాటిని జనసేన బయట ప్రపంచానికి చూపించినందుకా.
అలాగే ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తి అరచినందుకా. మీరు రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ పేరిట ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా లేక మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని తెలియచేసినందుకా అంటూ నాదెండ్ల మనోహర్ నిలదీసినంత పనిచేశారు.
ఏది ఏమైనా ఇపుడు వైసీపీ ఏమి అన్నా కూడా జనసేన క్షణం కూడా లేట్ చేయకుండా గట్టిగానే రిటార్ట్ ఇస్తోంది. మరి జనసేన సంగతి సరే కానీ దాని గురించి నిన్నటిదాకా పట్టనట్లుగా ఆ పేరు ఎత్తకుండా ఉన్న సీఎం ఇపుడు ఏకంగా పేరు పెట్టి విమర్శలు చేయడంలో మ్యాటర్ ఎంటబ్బా అనే అంతా ఆసక్తిగా ఆలోచిస్తున్నారు. అయితే సీఎం తమ గురించి మాట్లాడుతున్నారంటే తమ ఫోర్స్ చాలా బాగా పెరిగినట్లే అని జనసేన వర్గాలు అంటున్నాయి. ముందు ముందు జనసేన పేరుని ఎన్ని వంకర్లు తిప్పి వైసీపీ నేతలు మాట్లాడుతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.