Begin typing your search above and press return to search.
‘జనవేదన’..మరీ ఇంత ఆవేదన ఏంటి బాసు?
By: Tupaki Desk | 7 Feb 2017 8:46 PM ISTటైమ్లీగా ఉంటే అదిరిపోయే స్పందన ఉంటుంది. అంతేకానీ.. ఎప్పుడో జరిగినదానికి.. మరెప్పుడో నిరసన చేస్తే ఏమాత్రం బాగోదు. ఆ చిన్న విషయాన్ని కూడా ఏపీ కాంగ్రెస్ నేతలు మిస్ అవుతున్నారు. పరాజయం తీసుకొచ్చిన ఫస్ట్రేషన్లో.. లేకపోతే.. ఏదో ఒకటి.. ఎప్పుడు తడితే అప్పుడు చేసుకుంటూ పోవాలన్న తత్త్వమో కానీ.. వారు వ్యవహారం ఇప్పుడు కాస్తంత కామెడీగా మారింది.
దొంగలు పడిన ఆర్నెల్లకు కుక్కలు మొరిగితే ఎంత ఛండాలంగా ఉంటుందో.. ఆ మధ్యన నోట్ల రద్దు నిర్ణయంతో జనాల సహనానికి పెద్ద పరీక్ష పెట్టిన మోడీ మాష్టారి తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఏపీ కాంగ్రెస్.. ‘‘జనవేదన’’ పేరిట భారీ సభను నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్. మంచి కాక మీద ఉన్నప్పుడు సభ పెట్టాల్సింది పోయి.. జనాల్లో నోట్ల రద్దు నిర్ణయం కారణంగా ఏర్పడిన అసౌకర్యాన్ని పూర్తిగా మర్చిపోయిన వేళలో.. దానిపై నిరసన అంటూ చెబుతున్న కాంగ్రెస్ నేతలు మాటలు ఒక పట్టాన అర్థంకావు.
తాము నిర్వహించే నిరసన సభకు జనాల నుంచి రెస్పాన్స్ కూడా ఉండాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్ నేతలకు తట్టదా? అన్నది ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు. ఇదే ప్రశ్నను కాస్త పొందిగ్గా అడిగితే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అవుతూ.. నోట్ల రద్దు కారణంగా జరిగిన నష్టాలపై తమ సభ నిర్వహిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. కాలం చెల్లిన పార్టీకి.. కాలం చెల్లిన ఐడియాలే వస్తాయంటే ఇదేనేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/