Begin typing your search above and press return to search.

తండ్రి పార్టీ మారేందుకు నాదెండ్ల మ‌నోహ‌ర్ నో!

By:  Tupaki Desk   |   12 July 2019 3:14 PM GMT
తండ్రి పార్టీ మారేందుకు నాదెండ్ల మ‌నోహ‌ర్ నో!
X
నాదెండ్ల భాస్క‌ర్‌ రావు....మాజీ ముఖ్యమంత్రి గానే కాకుండా తెలుగు రాజ‌కీయాల్లో కీల‌క మ‌లుపుల‌కు కార‌ణ‌మైన‌ వ్య‌క్తిగా ఆయ‌న‌కు పేరుంది. కాంగ్రెస్ పార్టీ నేత‌గా సుదీర్ఘ‌కాలంగా గుర్తింపు పొందిన నాదెండ్ల గ‌త వారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. క‌మ‌లం గూటికి చేరిన నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీ నాయకుడి హోదాలో తాజాగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా త‌న గురించి - త‌న కుమారుడి గురించి ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

కాంగ్రెస్ పని అయిపోయిందని ఆ పార్టీకి నాయకుడే లేకుండా పోయాడని నాదెండ్ల భాస్క‌ర్ రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ద్వారా బీజేపీ జాతీయ చీఫ్ అమిత్ ఫా తనను పార్టీలో చేరాల్సిందిగా కోరారని నాదెండ్ల భాస్కర్ రావు తెలిపారు. బీజేపీలో కార్యకర్తలా పనిచేయాలన్నదే తన ఉద్ధేశంమని అన్నారు. బీజేపీ మరో 20 - 30 సంవత్సరాలు పనిచేయాలని అన్నారు. వాజ్ పాయ్ హయాం లోనే తాను బీజేపీలో చేరాల్సి ఉంద‌ని చెప్పారు. అయితే అప్పుడు తన కొడుకు కాంగ్రెస్ తరపున స్పీకర్ గా పనిచేస్తున్నాడని.. అందుకే బీజేపీ లో చేరలేదని తెలిపారు. ప్ర‌ధాని మోడీ మగాడు మొనగాడని కితాబిచ్చారు. బీజేపీ రక్షణలో దేశం సురక్షితంగా ఉందన్నారు.

ప్రాంతీయ పార్టీలన్నీ కుల పార్టీలుగా - కుటుంబ పార్టీలుగా మారాయని నాదెండ్ల వ్యాఖ్యానించారు. దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గిందని - బంధు ప్రీతి - కుల అభిమానం పెరిగిందని పేర్కొన్నారు. తెలంగాణలో - ఆంధ్రప్రదేశ్‌ లో పార్టీ బలోపేతానికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పారు. పార్టీ కోసం ఏపీ అంతటా తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని ఆయన చెప్పుకొచ్చారు. దేశ భవిష్యత్తుకోసం జాతీయ పార్టీల అవసరం ఉందన్నారు. త‌న కుమారుడు పార్టీ మార‌డం గురించి ఆయ‌నే నిర్ణ‌యం తీసుకుంటార‌ని - తానేమీ ఒత్తిడి చేయ‌న‌ని భాస్క‌ర్‌ రావు వ్యాఖ్యానించారు.