Begin typing your search above and press return to search.
తనలా రియాక్ట్ కావటం లేదంటున్న మనోహర్
By: Tupaki Desk | 14 May 2016 6:31 AM GMTనాదెండ్ల మనోహర్ గుర్తున్నారా? ఉమ్మడి రాష్ట్రంలో చివరి స్పీకర్ గా వ్యవహరించిన ఆయన చాలానే పరీక్షల్ని ఎదుర్కొన్నారు. ఏ ప్రభుత్వ హయాంలోనూ ఏ స్పీకర్ ఎదుర్కోనన్ని ఇబ్బందుల్ని ఆయన ఎదుర్కొన్నారని చెప్పాలి. అనూహ్య పరిణామాలు.. రాష్ట్ర విభజన లాంటి పెద్ద విషయాలు ఓపక్క.. మరోవైపు పార్టీ అధినాయకత్వం మైండ్ సెట్ ను తెలుసుకోవటం.. అదే సమయంలో తనకున్న పరిమితుల్ని గుర్తు ఎరిగి వ్యవహరించటం లాంటి కఠిన పరీక్షలు నాదెండ్ల మనోహర్ కు ఎదురయ్యాయి.
నాలుగు కాలాల పాటు గుర్తు ఉండిపోయేలా పనితీరును ప్రదర్శించిన స్పీకర్లలో నాదెండ్ల మనోహర్ ఒకరిగా చెప్పొచ్చు. సబ్జెక్ట్ మీద అవగాహన.. తెలీని అంశాల మీద మరింత పట్టు పెంచుకునేందుకు ఆయన ఎంతగా శ్రమిస్తారో.. ఆయన్ను దగ్గర నుంచి చూసిన వారికి బాగానే తెలుసు. నిజానికి మనోహర్ సామర్థ్యానికి తగినంత గుర్తింపు రాలేదని చెప్పాలి. విభజన లాంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు పెద్ద ఫోకస్ రాలేదనే చెప్పాలి. అదే సమయంలో.. నిర్ణయాల పరంగా ఎలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవటం.. తన వైఖరి వివాదాస్పదం కావటం.. స్పీకర్ ఛెయిర్ కు చెడ్డపేరు తీసుకురాకుండా ఉండేందుకు ఆయన చాలానే శ్రమించారని చెప్పాలి.
అలాంటి మనోహర్.. విభజన అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలుకావటం.. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో పెద్దగా బయటకు రాలేదని చెప్పాలి. తాజాగా ఆయన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్ స్థానంలో ఉన్న వారు చేస్తున్న పనుల్ని తప్పు పడుతూ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. తాను స్పీకర్ గా ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేపై పిటీషన్ ఇచ్చిన 24 గంటల్లోనే స్పందించి..నోటీస్ ఇచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు. నోటీస్ ఇచ్చిన సభ్యుడిపై మూడు వారాల్లో వేటుపడేదని చెప్పిన ఆయన.. చంద్రబాబు అనుసరిస్తున్న తీరుతో రాజ్యాంగాన్ని నమ్మాలో.. పార్టీని నమ్మాలో అర్థంకాని పరిస్థితి నెలకొందంటూ తనదైన శైలిలో విమర్శలు చేశారు. మనోహర్ మాటలు వినేందుకు బాగానే ఉన్నా.. ఒకవేళ మనోహర్ కానీ.. వైఎస్ హయాంలో స్పీకర్ గా వ్యవహరించి ఉంటే.. ఇప్పుడీ మాటలు చెప్పే వారు కాదేమో. నాడు అధికారపార్టీ నుంచి ఎమ్మెల్యేలు జంప్ కావటంతో.. స్పీకర్ గా ఆయనేం చేయాలో అది చేశారు. కానీ.. ఇప్పడు అలాంటి పరిస్థితి లేదు కదా నాదెండ్ల మనోహర్ జీ.