Begin typing your search above and press return to search.

నాదెండ్ల ముందస్తు కలలు : తెనాలి సీటూ..మంత్రి పదవి స్వీటూ..!

By:  Tupaki Desk   |   12 Jun 2023 4:02 PM GMT
నాదెండ్ల ముందస్తు కలలు : తెనాలి సీటూ..మంత్రి పదవి స్వీటూ..!
X
రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎవరైనా ఒకసారి అయినా మినిస్టర్ అనిపించుకోవాలి. లేకపోతే అర్ధం పరమార్ధం అన్నవి దక్కవు. ఇది పొలిటికల్ ఫిలాసఫీ. నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర రావు వారసుడి గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అయితే నాదెండ్ల భాస్కర రావు పాలిటిక్స్ చూస్తే ఎక్కడా సవ్యంగా సాగినది లేదు.

ఆయన వారసుడి గా వచ్చిన మనోహర్ 2004, 2009లలో తెనాలి నుంచి గెలిచారు. దాని కి ప్రాతిపదిక ఆయన తండ్రి నాదెంద్ల భాస్కర రావు 1989లో అక్కడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా పోటీ చేసి ఒకసారి గెలిచారు. ఇక తెనాలి సీటు టీడీపీ కి పట్టున్న సీటు.

ఆ పార్టీ పెట్టాక ఇప్పటికి అయిదు సార్లు అక్కడ గెలిచింది. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తే కేవలం 29 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే టీడీపీ తరఫున పోటీ చేసిన నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఓడినా 76 వేల కు పైగా ఓట్లు వచ్చి సెకండ్ ప్లేస్ లో నిలిచారు.

అందుకే ఇపుడు తెనాలి సీటు నాదే అంటున్నారు ఆలపాటి రాజా. నిజాని కి ఈ సీటు పేచీ ఇపుడు రావాల్సింది కాదు నాదెండ్ల మనోహర్ తొందర పడి ముందే కోయిన కూసినట్లుగా తెనాలి లో తాను పోటీ చేస్తాను అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. తెలుగుదేశం జనసేన పొత్తు ఉంటుంది కాబట్టి తాను సులువుగా గెలుస్తాను అన్న ధీమా తో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు.

అంతే కాదు వైసీపీ నుంచి చాలా మంది తన పార్టీ లో చేరారని ఆయన ఒక సభ పెట్టి హల్ చల్ చేశారు ఇక్కడే తేడా కొట్టేసింది. ఈ సీటు లో టీడీపీ తరఫున పెద్ద తలకాయగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఇదంత చూస్తూ ఊరుకుంటారా.2019 ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లను తెచ్చుకున్న తాను 2024లో మరోసారి పోటీ చేస్తానని ప్రకటించేశారు.

అలా మనోహర్ ఆశల కు కళ్లెం వేశారు. నిజానికి తెనాలి సీటు సొంతది అని నాదెండ్ల మనోహర్ చెప్పుకుంటున్నా ఆయన అక్కడ ఎక్కువగా తిరిగింది లేదు అని టీడీపీ వారు అంటున్నారు. ఆయన ఉండేది హైదరాబాద్ అని అంటున్నారు. దాంతో మనోహర్ కల ఇపుడు ముందే బయట కు చెప్పుకోవడం ద్వారా టీడీపీ జనసేనల మధ్యలో కలవరాన్ని రేపారు అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే సర్వేలు ఆధారంగానే టికెట్లు అడగాల ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అలా చూసుకుంటే తెనాలి లో టీడీపీ కి పట్టు ఉంది అని క్లియర్ గా తేలిపోతోంది కదా అంటున్నారు. దాంతో నాదెండ్ల మనోహర్ కి సీటు ఎక్కడ అకామిడేట్ చేస్తారు అన్నదే చర్చగా ఉంది. ఇక తెనాలి తప్ప మరో సీటు అయితే మనోహర్ కి లేదు అంటున్నారు.

ఆయన కు అది కాదు అంటే కలలు కల్లలు అవుతాయి. ఈసారి తెలుగుదేశం పొత్తులో గెలిస్తే పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కు అధికార యోగం దక్కుతుంది. మంత్రి పదవి ని ఆయన దక్కించుకుంటారు అని అంటున్నారు. రెండు సార్లు గతం లో ఎమ్మెల్యే అయినా మంత్రి కాలేకపోయిన నాదెండ్ల మనోహర్ 2024లో గెలిచి మినిస్టర్ అనిపించుకోవాలని తపన పడుతున్నారు కానీ సీటు దగ్గరే పేచీ వచ్చేసింది.

దీంతో ఆయన ఎలా నెగ్గుకుని వస్తారు. తెనాలి సీటు ని ఎలా సాధించుకుంటారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. మొత్తానికి నాదెండ్ల మనోహర్ అయితే జనసేన డిప్యూటీ గా ఉంటూ నాలుగేళ్ళుగా ఆ పార్టీ ని భుజాన మోస్తున్న దాని కి ప్రతిఫలంగా సీటు అయినా దక్కించుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.