Begin typing your search above and press return to search.
ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షుడు కావలెను
By: Tupaki Desk | 1 Nov 2017 6:37 PM ISTఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్ఠానం కొన్నాళ్లుగా అనుకుంటున్నా అది సాధ్యం కావడం లేదట. మామూలుగా అయితే, పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ భారీగా ఉంటుంది. కానీ, ఏపీలో పరిస్థితి వేరు. అక్కడ కాంగ్రెస్ దిక్కూమొక్కూ లేకుండా పడి ఉంది. నాయకులంతా తలో పార్టీలోకి మారిపోయారు. ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి మొహం చెల్లనివారు పార్టీలో కొనసాగుతున్నా పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. దీంతో రఘువీరా రెడ్డి ఒక్కరే ఒంటరి పోరాటం చేసేవారు. కొన్నాళ్లుగా ఆయన కూడా స్పీడు తగ్గించారు. దాంతో కాస్త ఛరిష్మా ఉన్న నేతను పీసీసీ అధ్యక్షుడిని చేయాలని కాంగ్రెస్ కొంతకాలంగా అనుకుంటోంది. మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని పీసీసీ చీఫ్ చేయాలని ప్రతిపాదన ఆయన ముందు పెట్టినా ఆయన కాదనేశారని టాక్. మిగిలిన ఒకరిద్దరు నేతలు కూడా కాంగ్రెస్ ను భరించేందుకు ముందుకు రాలేదు. దీంతో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై ఇప్పుడు అధిష్ఠానం ఆశలు పెట్టుకుంది. కానీ... నాదెండ్ల కూడా అందుకు నో చెప్పారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.
సమైక్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చివరి స్పీకర్ గా పనిచేసిన మనోహర్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం సామాజికవర్గానికే చెందిన నేత కావడంతో మనోహర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఆ సామాజిక వర్గ ఓట్లను కొంతవరకు చీల్చొచ్చన్నది కాంగ్రెస్ ఆశగా తెలుస్తోంది.
అయితే... కాంగ్రెస్ చావు బతుకుల్లో ఉన్నప్పటికీ పార్టీని వీడకుండా, ఎవరూ తన వెంటరానప్పటికీ పార్టీ భారాన్ని మోస్తున్న తనను కాదని వేరేవారికి పగ్గాలు అప్పగించాలని అధిష్ఠానం తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడంతో రఘువీరా అలకబూనినట్లు తెలుస్తోంది. ఎవరూ తీసుకోకున్నా అందరి వెంటా పడుతున్న పార్టీపై ఆయన సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. మరోవైపు నాదెండ్ల మనోహర్ తో పార్టీ పెద్దల మంతనాలు కూడా కొలిక్కి రాలేదని సమాచారం. దీంతో ఏపీ కాంగ్రెస్ ను ఆదుకునేవారు ఎవరా అని అధిష్ఠానం చూస్తోంది.