Begin typing your search above and press return to search.

నాగబాబు వదిలేలా కనిపించడం లేదు

By:  Tupaki Desk   |   7 Feb 2019 10:04 AM GMT
నాగబాబు వదిలేలా కనిపించడం లేదు
X
గత కొంత కాలంగా తన శైలికి భిన్నంగా వర్తమాన రాజకీయాల మీద వీడియోల రూపంలో విరుచుకుపడుతున్న నాగబాబుకు అపోజిషన్ సెగ మొదలైంది. రెండు రోజుల క్రితం తన యు ట్యూబ్ ఛానల్ లో ఓ పత్రిక నారా లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లడాన్ని అతిశయోక్తిగా పొగడటాన్ని భజన తాళాలు పట్టుకుని సెటైర్లు వేసిన నాగబాబు వీడియో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. అందులో పత్రిక పేరుని స్పష్టంగా చెప్పడంతో పాటు స్పష్టమైన ఆధారాలు పొందుపరచడంతో తెలియని వాళ్ళకు కూడా ఈ విషయం రీచ్ అయిపోయింది.

సో జరుగుతున్న డ్యామేజ్ ని గుర్తించిన సదరు పత్రిక ప్లస్ అధికార పార్టీ వర్గాలు ఆ వీడియోను ఏవో ఇతరత్రా కారణాలు చూపించి డిలీట్ చేయించింది. అయితే నాగబాబు సైలెంట్ కాలేదు. దానికి స్పందన ఇంకాస్త వ్యంగ్యాన్ని జోడించి మరీ వీడియోని అప్ లోడ్ చేసారు. తనను ఎంత టార్గెట్ చేసి ఇలాంటి పనులు చేసినా తన అభిప్రాయాలు చెప్పడం మాననని కుండ బద్దలు కొట్టేసారు.

ఇప్పుడు డిలీట్ చేసిన వీడియోలోని విషయాలు మరోసారి ఉటంకించిన నాగబాబు ఈ సారి పత్రిక పేరుని కాస్త మార్చి తనను ఏ విధంగానూ వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండ జాగ్రత్త పడటం విశేషం. విదేశీ పర్యటనలకు వంటవాళ్ళను పంపితే పెట్టుబడులు వస్తాయని అంతే తప్ప ఇలా చంద్రబాబునో లోకేశో వెళ్ళాల్సిన అవసరం లేదని మరో కౌంటర్ వేసిన నాగబాబు మధ్యలో పదే పదే తాళాలు వేసే గుత్తులు ఉపయోగించడం గమనార్హం.

తన ఛానల్ లో 1 లక్షా 33 వేల చందాదారులు ఉన్నారని వీడియోలకు కోట్లలో రీచ్ ఉందని ఇలా ఒకటి డిలీట్ చేసినంత మాత్రాన తన భావవ్యక్తీకరణ ఆపనని స్పష్టం చేసిన నాగబాబు ఇకపై తన ధోరణి ఎలా ఉండబోతోందో మరోసారి స్పష్టం చేసారు. కామెంట్స్ లో మెగా ఫ్యాన్స్ నుంచి మద్దతు దక్కడం విశేషం. జనసేనలో ప్రత్యక్షంగా లేకపోయినా నాగబాబు విసురుతున్న ఈ బాణాల పూర్తి లక్ష్యం ఏమిటో ఇంకొద్ది రోజులు ఆగితే ఇంకా క్లారిటీ రావొచ్చు