Begin typing your search above and press return to search.
అతడు పాములాంటి వాడు: నాగబాబు ధ్వజం!
By: Tupaki Desk | 8 March 2019 12:53 PM GMTప్రజారాజ్యం పార్టీలో కీలకంగా పని చేసిన పరకాల ప్రభాకర్ పై మెగా ఫ్యామిలీలో కసి ఇంకా తగ్గినట్టుగా లేదు. ప్రజారాజ్యం విలీనం అయిపోయి - చిరంజీవి ఊసు రాజకీయాల్లో లేకుండా పోయినా.. ఆ పార్టీ ఫెయిల్యూర్ కు అంతా కారణం పరకాల ప్రభాకరే అన్నట్టుగా మెగా బ్రదర్స్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా నాగబాబు అదే విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పరకాల ప్రభాకర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన.
'పరకాల ప్రభాకర్ ఒక పాము.. ' అని నాగబాబు అన్నారు. తను హృదయపూర్వకంగా మాట్లాడుతున్నట్టుగా చెప్పిన నాగబాబు పార్టీ విషయంలో పరకాల ప్రభాకర్ చాలా ద్రోహం చేశారని, చిరంజీవిని మిస్ లీడ్ చేశారని అన్నారు. ప్రభాకర్ లాంటి వాళ్లు చేసిన ద్రోహం వల్లనే చిరంజీవి పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయాల్సి వచ్చిందని నాగబాబు చెప్పుకు రావడం విశేషం!
తాము ఒక గొప్ప ఆశయంతో ప్రజారాజ్యం పార్టీని మొదలుపెట్టామని.. తనకు ఇమేజ్ తో చిరంజీవి ప్రజాసేవ చేద్దామని అనుకున్నారని నాగబాబు చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడం తమను అనుకున్న లక్ష్యాలను చేర్చలేకపోయిందని అన్నారు. సమయం తక్కువ ఉండటంతో పార్టీకి కేడర్ ను నిర్మించలేకపోయినట్టుగా చెప్పారు. దీంతో అధికారంలోకి రాలేకపోయినట్టుగా, అదే సమయంలో పరకాల ప్రభాకర్ ద్రోహం చేశారని, అమ్మలాంటి పార్టీకి ద్రోహం చేశారని అన్నారు. అలాంటి చర్యలతో పార్టీ దెబ్బ తిన్నదని నాగబాబు వ్యాఖ్యానించారు.
ప్రభాకర్ ను చిరంజీవి ఎంతగానో నమ్మారని.. అయితే ఆయన మాత్రం ద్రోహం చేశారన్నారు. అందుకే పరకాలను పవన్ కల్యాణ్ కూడా విమర్శించారని, పరకాలను కోవర్ట్ అని తన సోదరుడు పవన్ అన్నట్టుగా నాగబాబు చెప్పారు.
పవన్ కల్యాణ్ చాలా నైస్ పర్సన్ అని, ప్రజారాజ్యం పార్టీ అనుభవాలతో అప్పుడు నేర్చుకున్న పాఠాలతో ఇప్పుడు జనసేనను నడిపిస్తూ ఉన్నట్టుగా నాగబాబు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తము ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినట్టుగా నాగబాబు చెప్పుకొచ్చారు. అయితే ప్రజారాజ్యం ఫెయిల్యూర్ విషయంలో చాలా రకాల విశ్లేషణలు ఉన్నా.. మెగా ఫ్యామిలీ మాత్రం కేవలం పరకాల ప్రభాకర్ ను బూచిగా చూపిస్తుండటం మాత్రం ఒకింత విడ్డూరంగానే ఉంది!