Begin typing your search above and press return to search.
ఇపుడు కావల్సింది లాక్ డౌన్ కాదు మెడికేర్ - నాగబాబు
By: Tupaki Desk | 1 July 2020 3:00 AM GMTకరోనా వైరస్ అదుపు తప్పుతున్న నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి తిరిగి లాక్డౌన్ విధించాలని అనేక వర్గాల ప్రజల నుండి డిమాండ్లు ఉన్నట్లు ప్రభుత్వం చెప్పింది. అంతకంతకూ పెరిగిపోతున్న కేసులు చూశాక ప్రభుత్వం కూడా అదే దృక్పథంతో ఉన్నట్టు తెలుస్తోంది. జూలై 3 నుంచి 20 వరకు హైదరాబాద్ నగరం విస్తరించి ఉన్న జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో లాక్ డౌన్ విధించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జులై 2న తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో... కొన్ని వ్యతిరేక స్వరాలు కూడా వినిపిస్తున్నాయి.
టెస్టులు పెంచిన కొద్దీ కోవిడ్ -19 కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశమంతటా ఇదే పరిస్థితి. పిండికొద్దీ రొట్టె అన్నట్లు రాష్ట్రం సైజు కొద్దీ కేసులు బయటపడుతున్నాయి. దీంతో పలు ఇతర రాష్ట్రాలు విధించారు. కొన్ని అదేబాటలో నడిచే ప్రయత్నం చేస్తున్నాయి. తరచుగా పలు సాధారణ, రాజకీయ అంశాలపై స్పందించే నటుడు, రాజకీయ నేత నాగబాబు ఇటీవల కాలంలో తన అభిప్రాయాలన్నీ తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగానే వినిపించారు. అయితే లాక్ డౌన్ విషయంలో మాత్రం ఆయన దీనికి విరుద్ధంగా స్పందించారు.
లాక్ డౌన్ ఆలోచన మరోసారి చేస్తే అది ‘చరిత్రాత్మక తప్పు’ అని అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కరోనావైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 60 నుంచి 90 రోజుల వరకు లాక్‌డౌన్ విధించాయని ఆయన అన్నారు. అప్పుడు మనకు అవగాహన లేదు. సదుపాయాలు లేవు. కానీ ఇపుడు మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవసరం లాక్ డౌన్ కాదు, మెడికేర్ మాత్రమే అని బల్లగుద్ధి చెప్పారు. ఇకపై లాక్డౌన్ పరిష్కారం కాబోదు అన్నారు.
పైగా లాక్ డౌన్ విధిస్తే దెబ్బతినే తమ జీవితాలపై ఆందోళనగా ఉన్న ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాట్లు చేసే ప్రమాదం కూడా లేకపోలేదన్నారు. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన జనం మరోసారి తమ ఆదాయాన్ని ఇంతకంటే దారుణంగా కోల్పోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ప్రభుత్వం సడలింపులతోనే పరిష్కారాలు కనుక్కోవడం మంచిదన్నారు. మొత్తానికి కేసీఆర్ అభిప్రాయానికి వ్యతిరేకంగా నాగబాబు గట్టిగా తన స్వరం వినిపించారని చెప్పాలి.