Begin typing your search above and press return to search.

భ‌ద్రాచ‌లానికి నాగా సాధువులు!

By:  Tupaki Desk   |   12 July 2015 5:47 PM GMT
భ‌ద్రాచ‌లానికి నాగా సాధువులు!
X
ఒంటి మీద నూలుపోగు లేకుండా.. ఒళ్లంతా విబూది.. మెడ‌లో రుద్రాక్ష‌మాల‌లు.. చేతిలో త్రిశూలం ప‌ట్టుకొని..నిత్యం భ‌గ‌వ‌న్నామ స్మ‌ర‌ణ‌తో..అత్యంత క్లిష్ట‌మైన‌.. క‌ష్ట‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఉండే హిమాల‌యాల్లో నివ‌సించే నాగా సాధువులు గోదావ‌రి పుష్క‌రాల‌కు వ‌స్తున్నారు.

వారంతా.. భ‌ద్రాచ‌లానికి రావ‌టం ఒక విశేషం. పెద్ద సంఖ్య‌లో వ‌స్తున్న నాగా సాధువుల‌తో పాటు.. మ‌రికొన్ని వ‌ర్గాల‌కు చెందిన సాధువులు సైతం భ‌ద్రాచ‌లానికి రానున్నారు.

వీరి రాక‌తో.. తెలంగాణ‌లో నిర్వ‌హిస్తున్న పుష్క‌రాల‌కు స‌రికొత్త ఆధ్యాత్మిక శోభ చేకూరుతుంద‌ని భావిస్తున్నారు.నాగా సాధువుల ధూళి దొరికితే చాలు త‌మ జీవితం ద‌శ తిరుగుతుంద‌ని.. వారి క‌టాక్షాలు ఉండాలే కానీ.. అనుకున్న‌వ‌న్నీ జ‌రిగిపోతాయ‌న్న న‌మ్మ‌కాలు చాలానే ఉన్నాయి. సాధువుల్ని విప‌రీతంగా గౌర‌వించి.. మ‌ర్యాద ఇచ్చే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. నాగా సాధువుల కోసం ప్ర‌త్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

కేవ‌లం వీరికి ఎలాంటి లోటు రాకుండా ఉండేలా చేయ‌టానికి రూ.కోటి నిధుల్ని విడుద‌ల చేశారు. వారికి అవ‌స‌ర‌మైన వ‌స‌తితో పాటు.. మిగిలిన సౌక‌ర్యాల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు రెండు వేల మంది వ‌ర‌కూ వ‌చ్చే ఈ సాధువుల ద‌ర్శ‌నం కోసం పెద్దఎత్తున భ‌క్తులు ఎదురు చూస్తుంటారు. తెలంగాణ గోదావ‌రి పుష్క‌రాల‌కు నాగా సాధువులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మార‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.