Begin typing your search above and press return to search.

తెలంగాణలో భయం లేకుండా మాట్లాడేది పవనే..

By:  Tupaki Desk   |   2 May 2019 4:59 AM GMT
తెలంగాణలో భయం లేకుండా మాట్లాడేది పవనే..
X
మెగా బ్రదర్, జనసేన నర్సాపూర్ ఎంపీ అభ్యర్థి నాగబాబు ఇంటర్మీడియెట్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇంటర్ అవకతవకలపై ధైర్యంగా మాట్లాడిన ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమేనని.. మిగతా వాళ్లు అందరూ నోరు తెరవడానికే భయపడుతున్న వేళ.. నిర్భయంగా మాట్లాడాడని.. పరీక్ష ఫలితాల్లో లోసగులను ఎత్తిచూపి ధైర్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారని తెలిపారు.

తాజాగా లోక్ సభ - అసెంబ్లీ అభ్యర్థుల కమిటీ సమావేశంలో నాగబాబు కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న ఇంటర్ వివాదంపై మాట్లాడారు.. ‘దండేత్తుతాం.. కూల్చేస్తామంటూ ఏపీ రాజకీయాలపై మాట్లాడే సినీ ప్రముఖులు - రాజకీయ నాయకులు.. తెలంగాణలోని ఇంటర్ వివాదంపై కనీసం ప్రశ్నించిన పాపాన పోలేదని’ ఎండగట్టారు. వాళ్లు ఎందుకు ఇంతలా భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తమ జనసేన నాయకులు, కార్యకర్తలు, స్టూడెంట్ విభాగం నాయకులు ప్రగతి భవన్ ను ముట్టడించి ఈ సమస్యను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లారని కొనియాడాడు.

ఇంటర్ వివాదంలో తెలంగాణ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ తూర్పారపట్టలేదని.. దాని లోసగులను ఎత్తిచూపి పరిష్కార మార్గాలను సూచించారని.. నిర్మాణాత్మక విమర్శలు చేశారని నాగబాబు ప్రశంసించారు. వ్యవస్థలోని తప్పులను పవన్ ఎత్తిచూపాడన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన అందరి విద్యార్థుల పరీక్ష పత్రాలను రీవెరిఫికేషన్ - రీవాల్యుయేషన్ ను ఉచితంగా చేయాలని కోరాకనే కేసీఆర్ అమలు చేశారని.. ఇది పవన్ విజయం అని నాగబాబు చెప్పుకొచ్చారు.

ఇక నాగబాబు ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ఇంటర్ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం లేట్ గా స్పందించిందని.. అదే ముందే మేలుకొని చర్యలు తీసుకుంటే కనీసం 10 మంది విద్యార్థుల జీవితాలు కాపాడి ఉండేవాళ్లమని వాపోయాడు.

తెలంగాణ స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల్లో జనసేన నేతలు పోటీచేయాలని.. కొన్ని స్థానాలైన గెలిచి తెలంగాణలో సత్తాచాటాలని నాగబాబు సూచించారు.