Begin typing your search above and press return to search.

పాల్.. ఇప్పుడిలా ఎందుక‌య్యారో చెప్పిన నాగబాబు!

By:  Tupaki Desk   |   26 March 2019 5:02 AM GMT
పాల్.. ఇప్పుడిలా ఎందుక‌య్యారో చెప్పిన నాగబాబు!
X
నువ్వొక‌టి అంటే నేను ప‌ది అంటా అన్న‌ది రాజ‌కీయాల్లో ఇప్పుడు కామ‌న్ అయింది. ఈ విష‌యంలో ఎవ‌రూ త‌గ్గ‌టం లేదు. చోటా నేత నుంచి కీల‌క స్థానాల్లో ఉన్న వారు వ‌ర‌కూ నోటికి ఎంత వ‌స్తే అంత మాట్లాడేయ‌టం.. దూకుడు వ్యాఖ్య‌లు చేయ‌టం ఈ మ‌ధ్య‌న అల‌వాటుగా మారింది.

ఇలాంటి వేళ‌.. త‌న‌ను త‌ప్పు ప‌ట్టిన వారిని.. త‌న‌పై విమ‌ర్శ‌లు చేసే వారిని ఉద్దేశించి జెంటిల్ వ్యాఖ్య‌లు చేయ‌టాన్ని ఊహించ‌లేం. తాజాగా అలా వ్య‌వ‌హ‌రించి అంద‌రి దృష్టి త‌న మీద ప‌డేలా చేసుకోవ‌ట‌మే కాదు.. నాగ‌బాబు స్పెషాలిటీ అదేన‌బ్బా అనుకునేలా చేశారు.

న‌టుడిగా.. చిరు మెగా బ్ర‌ద‌ర్ గా.. అన్నింటికి మించి జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మ న్యాయ‌నిర్ణేత‌ల్లో ఒక‌రిగా వ్య‌వ‌హ‌రిస్తూ తెలుగోళ్ల‌కు ఎంతో ద‌గ్గ‌ర‌య్యారు. జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌ లో జ‌డ్జిగా త‌న అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్లుగా చెప్ప‌టం.. సూటిగా.. సుత్తి లేకుండా త‌న‌కు అనిపించింది మాత్ర‌మే చెప్పే అల‌వాటున్న నాగ‌బాబు తాజాగా ఎంపీ స్థానానికి పోటీ చేయ‌టం తెలిసిందే.

ప‌వ‌న్ ను త‌న పార్టీలోకి ర‌మ్మ‌ని చెప్ప‌టంతో పాటు.. న‌ర‌సాపురం నుంచి నాగ‌బాబు పోటీ చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న విడుద‌లైన వెంట‌నే పాల్ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేశారు. మ‌రి.. త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన వ్య‌క్తిపై నాగ‌బాబు ఎలా రియాక్ట్ అయ్యారు? ఏమ‌ని కామెంట్స్ చేశార‌ని చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఇటీవ‌ల కాలంలో త‌న‌ను తిట్టిన వారిని ఉద్దేశించి డీసెంట్ గా వ్యాఖ్య‌లు చేయ‌టం చూడ‌లేం. ఆ లోటును భ‌ర్తీ చేస్తూ నాగ‌బాబు ఆస‌క్తిక‌రంగా స్పందించారు.

పాల్ మీద మీ అభిప్రాయం ఏమిటంటూ ఒక ఇంట‌ర్వ్యూలో అడ‌గ్గా నాగ‌బాబు స్పందిస్తూ.. ఆయ‌నో దైవ‌దూత అని.. ఒక మ‌తానికి సంబంధించి ప్రపంచం మొత్తానికి పేరు సంపాదించినోడ‌న్నారు. త‌న‌కు ఆయ‌న‌పైన చాలా గౌర‌వం ఉంద‌న్న నాగ‌బాబు.. అత‌ను ఆషామాషీ వ్య‌క్తి కాదన్నారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఆయ‌న్ను మాన‌సికంగా చిత‌క్కొట్టేశార‌ని.. త‌మ వారికి పేరు తీసుకురావ‌టం కోసం పాల్ ని తొక్కేశార‌న్నారు. "ఆయ‌న ఆస్తుల్ని బ్లాక్ చేశారు. ఆయ‌న‌పై కేసులు పెట్టారు. దాని తాలూకు డిప్రెష‌న్ లో ఆయ‌న త‌న స్థిర‌త్వాన్ని కోల్పోయారు. అందుకే సాధ్యం కాని ప‌నులు చేస్తాన‌ని చెబుతుంటారు. నా దృష్టిలో ఆయ‌న గొప్పొడు. కానీ ప‌రిస్థితుల ప్ర‌భావంలో ఇలా అయ్యారు. ఆయ‌న రాజ‌కీయాల‌కు దూర‌మైతే మంచిది" అంటూ పాల్ మీద త‌న‌కున్న గౌర‌వాన్ని ప్ర‌ద‌ర్శించారు. నాగ‌బాబు వ్యాఖ్య‌ల్లో విమ‌ర్శ‌లు ఉన్నాయి. అదే స‌మ‌యంలో వాస్త‌వం ఉంది. అన్నింటికి మించి బ్యాలెన్స్ ఎక్క‌డా మిస్ కాకుండా.. గౌర‌వ‌ప్ర‌దంగా విమ‌ర్శ‌లు చేసిన తీరు.. ప్ర‌త్య‌ర్థుల‌పై ఆరోప‌ణ‌ల్ని సంధించిన తీరును మిగిలినోళ్లు ఫాలో అయితే బాగుంటుంది.