Begin typing your search above and press return to search.
చంపేస్తారా.. చావడానికి సిద్ధం!
By: Tupaki Desk | 6 March 2019 6:40 AM GMTగత కొంతకాలంగా అగ్రెసివ్ గా జనసేన తరుఫున వరుస వీడియోలు పెడుతున్న సీనియర్ సినీ నటుడు నాగబాబు మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈసారి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన నిర్వహిస్తున్న యూట్యూబ్ చానెల్ ద్వారా వీడియోను వదిలారు. జనసేన పార్టీలో లేకున్నా తాను జనసేన కోసం ఏమైనా చేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీపై కక్ష కడుతున్న అధికార టీడీపీ ఎంతకాలం అధికారంలో ఉంటుందో చూస్తానని నాగబాబు సవాల్ విసిరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, మరో టీడీపీ నేత యామినిలపై అసభ్యకర పోస్టుల నేపథ్యంలో కొందరు జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో నాగబాబు స్పందించారు. జనసేన పార్టీ కార్యకర్తలను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు తెలిసిందని నాగబాబు అన్నారు. అసలు థర్డ్ డిగ్రీ ఏ సమయంలో ప్రయోగిస్తారు..? అని నాగబాబు ప్రశ్నించారు. ఇదంతా అధికార పార్టీ చేస్తున్న కుట్రలో భాగమేనన్నారు. మరోసారి జనసేన కార్యకర్తలపై ఇలాంటి ప్రయోగాలు చేస్తే ప్రత్యక్షంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని నాగబాబు హెచ్చరించారు. నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తే.. చావడానికి సిద్ధంగా ఉన్నానని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోలేదని - అయితే జనసేన పార్టీ కోసం ఏమైనా చేస్తానని నాగబాబు అన్నారు. జనసేన పార్టీ కోసం తాను ఎంతకైనా తెగిస్తానని హెచ్చరించారు. ఓ వైపు వయసు మీదపడుతున్నా నేను దేనికి భయపడేది లేదని తెలిపారు. కొందరు సోషల్ మీడియాలో మాత్రమే నాగబాబు మాట్లాడుతారని బయటకు వచ్చి మాట్లాడరని అంటున్నారని... ప్రత్యక్ష పోరాటంలో కూడా పాల్గొనడానికి ఏమాత్రం వెనుకాడేది లేదన్నారు.
జనసేన పార్టీని భయపెట్టడానికి అధికార పార్టీ రకరకాల ప్రయోగాలు చేస్తోందని నాగబాబు విమర్శించారు.. ఎంత భయపెట్టిస్తే అంతకు రెట్టింపుగా పోరాడగలిగే శక్తి జనసేనకు ఉందన్నారు. అధికారంలో ఉన్నామని వీర్రవీగుతున్న నేతలు ఎంతకాలం అధికారంలో ఉంటారో చూస్తామని నాగబాబు సవాల్ విసిరారు. జనసేన కుటుంబ పార్టీ అనే ముద్రపడకూడదనే పార్టీకి దూరంగా ఉంటున్నానని, దూరంగా ఉంటున్నానని నాగబాబు తెలిపారు.