Begin typing your search above and press return to search.
వపన్ కు షాకిచ్చిన నాగబాబు: ప‌్రత్యక్ష రాజకీయాలకు బై బై అన్నట్టే
By: Tupaki Desk | 4 May 2020 12:30 PM GMTకొణిదెల కుటుంబానికి రాజకీయాలకు అచ్చి రానట్టు కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో కొణిదెల చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి కొంత ప్రభావం చూపినా ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేసి కేంద్రమంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. కాంగ్రెస్ కు గడ్డు కాలం వచ్చింది. ఇక చిరంజీవి ప్రజా జీవితం వదిలేశారు. ఆ తర్వాత సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆయన వ్యవహరిస్తున్న తీరుతో రాజకీయంగా అంతగా ఎదుగుదల లేదు. సోదరుడికి తోడుగా అన్న నాగబాబు రంగంలోకి దిగారు. ఆయన సోదరుడి మాదిరే రాణించలేకపోయారు. మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాభవం ఎదుర్కొన్నారు. తాజాగా ఆ విషయాలపై నాగబాబు స్పందించారు.
వాస్తవానికి తనకు రాజకీయాలు అంతగా ఇష్టం లేదని, తన సోదరుడు పవన్ విజ్ఞప్తితో తాను పోటీ చేశానని చెప్పి షాకిచ్చారు. రాజకీయం అంటే హేయభావం అని, అలాంటి అభిప్రాయం కలిగించింది ప్రజలేనని తెలిపారు. ఎప్పుడూ రాజకీయాలు కుళ్లు, రొచ్చు అనే మాటలు మాట్లాడతారు. మంచి వాళ్లు - యువకులు రాజకీయాల్లోకి రాకపోతే అలాగే తయారవుతోందని పేర్కొన్నారు. మంచివాళ్లు లేకుంటా గూండాలు - రౌడీలు పాలిస్తారని పరోక్షంగా అధికార పార్టీపై విమర్శలు చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సోషల్ మీడియాలో కొందరు వారసత్వ రాజకీయాలపై ప్రశ్నించిన సందర్భంగా నాగబాబు స్పందించారు.
వారసత్వ రాజకీయాల్లో మీరు ఎందుకు వచ్చారని అడగొచ్చు కానీ తాను అందరిలాగే సీటు ట్రై చేశానని.. అయితే తనకు పెద్దగా ఇంట్రస్ట్ లేకపోయినా పవన్ పిలిచి సీటు ఇచ్చారని తెలిపారు. అందుకే పోటీ చేశా తప్ప తనకు పెద్దగా ఇంట్రస్ట్ లేదని స్పష్టం చేశారు. భవిష్యత్ లో ప్రత్యక్షరాజకీయాల్లో పోటీ చేయకపోవచ్చని ప్రకటించారు. తాను ఎంపీ - ఎమ్మెల్యేగా పోటీ చేయనని.. చెబుతూ పరోక్షంగా రాజకీయాలకు బై అన్నట్టు తెలిపారు. జనసేన పార్టీని ఎలా ముందుకు నడిపించాలని మాత్రమే తనకు ఆసక్తి అని, పార్టీ నిర్మాణంలో భాగమవుతానని వివరించారు. పదవులు అనుభవించాలని కాదని పేర్కొన్నారు.