Begin typing your search above and press return to search.
పవన్ విద్యార్హత మీద నాగబాబు కన్ఫ్యూజ్ స్టేట్ మెంట్!
By: Tupaki Desk | 21 April 2019 10:28 AM GMTప్రముఖులు సామాన్యుల మాదిరి చదువుకోరా? లేదంటే సామాన్యుల మాదిరి చదవనోళ్లంతా ప్రముఖులు అవుతారా? కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ..కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రముఖుల విద్యార్హతకు సంబంధించిన వివరాలు విపరీతంగా కన్ఫ్యూజ్ చేసేస్తుంటాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం చదివారన్న విషయంలోకి వెళితే చాలు.. అవసరానికి మించిన కన్ఫ్యూజన్ ఖాయం.
ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ లో తాను టెన్త్ పాస్ అయినట్లుగా పేర్కొన్నారు పవన్. ఆ మధ్యలో ఇంటర్ అని చెప్పటం.. ఇంటర్లో ఏ కోర్సు అన్న దానికి సీఈసీ అని ఒకసారి.. ఎంపీసీ అని మరోసారి.. ఇలా తడవకో విషయాన్ని చదువుతు అభిమానుల మెదడుకు మేత పెట్టేస్తుంటారు.
ఇదిలా ఉంటే.. తాజాగా నాగబాబు ఒక వీడియోను షేర్ చేశారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఇంటర్ పరీక్షల నేపథ్యంలో.. పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యామన్న కారణంగా సూసైడ్ చేసుకోవటాన్ని తప్పు పడుతూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు నాగబాబు. యూట్యూబ్ ఛానల్ ద్వారా సందేశాన్ని ఇచ్చిన నాగబాబు.. తల్లిదండ్రుల పైనా. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదా విమర్శలు గుప్పించారు.
తమను ఏనాడు తమ తల్లిదండ్రులు ఫలానా చదవాలని ఎప్పుడు ఒత్తిడి చేయలేదన్నారు. విద్యా బోధన కమర్షియల్ గా మారిన వైనాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ సందర్భంగా తమ ఇంట్లో వారి చదువుల్ని ప్రస్తావించారు. చిరంజీవి డిగ్రీపూర్తి చేశారని.. తమ ఇద్దరు సిస్టర్స్ లో ఒకరు ఎంబీబీఎస్.. మరొకరు డిగ్రీ పూర్తి చేశారన్నారు.
పవన్ ఇంటర్ పూర్తి చేశాక.. ఐటీలో డిగ్రీ హోల్డర్ గా చెప్పుకొచ్చారు. తమ తల్లిదండ్రులు చదువు విషయంలో ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు.ఇప్పటికే పవన్ ఎడ్యుకేషన్ క్వాలిపికేషన్ మీద సాగుతున్న కన్ఫ్యూజన్ సరిపోనట్లుగా తాజాగా ఐటీ డిగ్రీ చేశారంటూ చెప్పిన మాట ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ప్లీజ్ నాగబాబుగారు.. తమ్ముడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద కాస్తంత క్లారిటీగా చెప్పేస్తే.. మిగిలినవన్నీ తీసేసి.. ఫైనల్ గా మీరు చెప్పిందే గుర్తు పెట్టుకుంటాం. ఏమంటారు మెగా బ్రదర్.