Begin typing your search above and press return to search.
పవన్.. ఇందులో నిన్ను కొట్టే వారే లేరయ్యా!
By: Tupaki Desk | 9 April 2019 6:35 AM GMTకోట్లాది మంది ఆరాధించే వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని వారి అభిమానులు నిశితంగా పరిశీలిస్తుంటారు. వారి అభిమానం.. వారిని ప్రముఖుల్ని చేస్తుంది. కోట్లల్లో ఒక్కరిగా చేస్తుంది. దీంతో..వారు ఆకాశం నుంచి దిగి వచ్చినట్లుగా ఫీల్ అవుతుంటారు. తాము కాలు బయటపెడితే.. తమను ప్రత్యేకంగా చూడాలని.. అందరి కంటే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలన్నట్లుగా వ్యవహరించటమే కాదు.. సెలబ్రిటీ స్టేటస్ ను అదే పనిగా మొయింటైన్ చేస్తూ ఉంటారు.
ఇలాంటి స్టీరియో టైప్ వ్యవహారాలకు దూరంగా ఉండే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గా చెప్పాలి. టాలీవుడ్లో తిరుగులేని నటుడిగా.. యూత్ లో క్రేజ్ ఉన్న పవన్.. బయటకు వచ్చినప్పుడు నార్మల్ గా ఉంటారు. తనను తాను సామాన్యుడిగా భావిస్తూ.. ఆర్భాటాలకు దూరంగా సింఫుల్ సిటీని మొయింటైన్ చేస్తుంటారు.
ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్న పవన్.. రాష్ట్రం మొత్తాన్ని తిరిగేస్తూ.. పార్ట విజయం కోసం విపరీతంగా తపిస్తున్నారు. అయితే.. ఆయన ఆశించినంతగా ప్రజల్లో స్పందన లేదన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. రాజకీయ నాయకుడిగా తన మాటల కంటే కూడా పవన్ కల్యాణ్ గా తన సింప్లిసిటీ విషయంలో ఏపీ ప్రజల మనసుల్ని దోచేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. భోజనం చేసేటప్పుడు ఒక సామాన్యుడి మాదిరి.. చెట్టు కింద కూర్చొని మట్టి మూకుడులో తిన్న వైనం వైరల్ గా మారింది. తాజాగా తన సోదరుడు.. నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబుతో కలిసి రోడ్డుకు ఒకవైపు కూర్చొని టీ తాగుతున్న వైనం చూస్తే.. ఇంత సింఫుల్ గా ఉంటే ప్రముఖ సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారంటే పవన్ మాత్రమేనని చెప్పక తప్పదు. రాజకీయంగా పవన్ ను అభిమానించకపోవచ్చు. ఆయనకు మద్దతు ఇవ్వకపోవచ్చు కానీ.. సామాన్యుడిగా వ్యవహరించే తీరుకు మాత్రం పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజలు ఫిదా అవుతారని చెప్పక తప్పదు.