Begin typing your search above and press return to search.
నాగబాబు జబర్దస్త్ పంచ్!... రేలంగిలా లోకేశ్!
By: Tupaki Desk | 28 March 2019 4:10 PM GMTటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి - ఏపీ మంత్రి నారా లోకేశ్ పై ఆది నుంచి బోలెడన్ని సెటైర్లు వచ్చిపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మరో సెటైర్ ఆయనను బాగానే ఇబ్బంది పెట్టేలానే ఉందని చెప్పక తప్పదు. ఇప్పటిదాకా ఏ ఒక్కరు ప్రస్తావించని విధంగా వచ్చి పడిన ఈ సెటైర్ లో లోకేశ్ ను పాత తరం కమెడియన్ రేలంగితో పోల్చారు. రేలంగితో లోకేశ్ కు ఈ పోలిక పెట్టింది వేరేవరో కాదు... సినిమా నటుడిగా, *జబర్దస్త్* షో జడ్జిగా వ్యవహరిస్తున్న కొణిదెల నాగేంద్ర బాబు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగానే సినిమాల్లోకి వచ్చిన నాగబాబు... తనకంటూ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకున్నా... బుల్లితెరపై మాత్రం జబర్దస్త్ షోతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
తాజాగా తన తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరిపోయిన నాగబాబు... ఏకంగా తన సొంత జిల్లా తూర్పు గోదావరిలోని నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగిపోయారు. సొంత జిల్లా కావడం - పవన్ మేనియాతో ఎంపీగా తాను గెలిచేస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తున్న నాగబాబు... ప్రచారం కూడా హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీలో నెంబర్ టూగా ఉన్న లోకేశ్ పై ఆయన నేటి ప్రచారంలో పవర్ పంచ్ లు సంధించారు. లోకేశ్ వ్యవహారం చూస్తుంటే... హాస్యనటుడు రేలంగిలా తయారయ్యాడంటూ ఎద్దేవా చేశారు. లోకేశ్ చేసే కామెడీ ముందు ‘జబర్దస్త్’ ఏమాత్రం చాలదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు పైనా నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగా లేదని వ్యాఖ్యానించిన నాగబాబు... తాడేపల్లి గూడెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈలి నానీని వదిలిపెట్టలేదు. నానీకి నవ్వడమే తప్ప ఏ పనీ చెయ్యడం చేతకాదని నాగబాబు అన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే, ఒక ఎంపీ ఏమేమి అభివృద్ధి పనులు చేయగలడో అవన్నీ చేసి చూపిస్తానని ఓటర్లను ఆకట్టుకునే వ్యాఖ్యలు కూడా చేశారు. మొత్తంగా తన ప్రచారంలో ప్రత్యర్థులపై పవర్ ఫుల్ పంచ్ లు సంధిస్తూ సాగుతున్న నాగబాబు... ఓటర్లనూ ఆకట్టుకునే యత్నం చేస్తున్నారన్న మాట.