Begin typing your search above and press return to search.

మెగాస్టార్ రాజకీయం గురించి తమ్ముడు నాగబాబు ఏం చెబుతున్నారు...?

By:  Tupaki Desk   |   3 Jun 2022 7:12 AM GMT
మెగాస్టార్  రాజకీయం గురించి తమ్ముడు నాగబాబు ఏం చెబుతున్నారు...?
X
చిరంజీవి మెగాస్టార్ గా మారారు. ఆయనది సినీ రంగాన నాలుగు దశాబ్దాలకు పైబడిన అనుభవం. బ్లాక్ బస్టర్స్ ఎన్నో ఆయన కెరీర్ లో ఉన్నారు. తన ప్రతిభకు ఆకాశమే హద్దు అని చాటిచెప్పిన మెగాస్టార్ రాజకీయాల్లోకి కూడా ఇప్పటికి పుష్కర కాలం క్రితం వచ్చారు. ఆయన ప్రజారాజ్యం పార్టీని పెట్టి 70 లక్షల దాకా ఓట్లను ఉమ్మడి ఏపీలో సాధించారు. అంతే కాదు, 18 ఎమ్మెల్యే సీట్లను కూడా దక్కించుకున్నారు.

ఆ తరువాత ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. ఆ పదవీకాలం అయిపోగానే ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఆయన మళ్లీ సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చారు. మలివిడత సినీ జీవితంలో ఆయన దూకుడుగా ఉన్నారు. వరసబెట్టి సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు.

మరి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఎనిమిదేళ్ళ నాడే స్థాపించారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని కూడా పవన్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉత్తరాంధ్రా టూర్ కి వచ్చిన మెగా బ్రదర్, జనసేన పీఏసీ సభ్యుడు అయిన కొణిదెల నాగబాబు అన్న చిరంజీవి రాజకీయ రీ ఎంట్రీ గురించి చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

మా అన్న గారు చిరంజీవి ప్రస్తుతం సినిమాల్లో హాయిగా ఉన్నారు. ఆయనకు కళారంగమే ఇష్టం. ఆయన మనశ్శాంతిగా అక్కడ ఉంటున్నారు. అందువల్ల ఆయన పొలిటికల్ రీ ఎంట్రీ ఉంటుందని భావించలేమని చెప్పేశారు. అయితే ఆయన నైతిక మద్దతు మాత్రం కచ్చితంగా జనసేనకే ఉంటుందని నాగబాబు చెప్పడం విశేషం.

మెగాస్టార్ అయితే ఇక మీదట రాజెకేయ తెరపైన కనిపించే అవకాశం అయితే లేదని నాగబాబు చెప్పేశారు. ఆయన సినిమాలు చేసుకుంటారు, మేము కూడా ఆయన్ని రాజకీయాల్లోకి రమ్మని కోరేది లేదని కూడా పేర్కొన్నారు. మొత్తానికి చిరంజీవి రాజకీయం గురించి తరచూ వస్తున్న పుకార్లకు కానీ ప్రచారానికి కానీ నాగబాబు ఇచ్చిన ఒకే ఒక స్టేట్మెంట్ తో ఫుల్ స్టాప్ పడినట్లే అనుకోవాలి.

అలాగే చిరంజీవిని ఇక మీదట ప్రత్యక్ష రాజకీయాల్లోకి చూడలేరు, ఆయన డైరెక్ట్ గా జనాల్లోకి వచ్చి ఫలానా పార్టీకి మద్దతు ఇవ్వండి అని అడిగే ప్రశ్న కూడా ఉండదు అంటున్నారు. జనసేనకు నైతిక మద్దతు ఉంటుందంటే అది ఎలా అన్నదే ఇపుడు చూడాల్సిన విషయం.