Begin typing your search above and press return to search.
నాగబాబు పిట్టకథ..అయ్యన్న ఉడికిపోయారబ్బా!
By: Tupaki Desk | 3 Nov 2019 6:26 PM GMTఏపీలో ఇసుక కొరత - ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులపై నిరసనకు దిగిన జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో ఆదివారం నిర్వహించిన లాంగ్ మార్చ్ కు మద్దతు ఇచ్చిన టీడీపీకి పంచ్ ల మీద పంచ్ లు పడిపోయాయి. పవన్ ఆహ్వానం మేరకు లాంగ్ మార్చ్ కు మద్దతు ప్రకటించిన టీడీపీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు... తన ప్రతినిధులుగా పార్టీ సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు - అచ్చెన్నాయుడులను అక్కడికి పంపిన విషయం తెలిసిందే కదా. లాంగ్ మార్చ్ లో పవన్ కారుపై షో చేస్తే... నాగబాబు అసలు మార్చ్ లోనే పాలు పంచు కోకుండా నేరుగా వేదిక మీదకు వచ్చేశారు. వీరిద్దరి కంటే కూడా కాస్తంత ఉత్సాహంగా కనిపించిన అయ్యన్నపాత్రుడు ఉడికిపోయేలా నాగబాబు వ్యవహరించిన తీరు ఆసక్తికరంగా మారిపోయిందని చెప్పక తప్పదు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతకు వైసీపీ సర్కారే కారణమని చెప్పేసిన నాగబాబు... టీడీపీ హయాంలో కూడా ఇంతకంటే పరిస్థితి ఏమీ మెరుగ్గా లేదని తనదైన శైలిలో చెప్పుకు పోయారు. మార్చ్ కు మద్దతు పలికిన టీడీపీ పైనే ఈ తరహాలో నాగబాబు సెటైర్లు వేస్తుంటే.. వేదిక మీదే కూర్చుని ఉన్న అయ్యన్న నిజంగానే ఉడికిపోయారని చెప్పాలి.
అయినా ఈ దిశగా నాగబాబు ఏమన్నారన్న విషయానికి వస్తే... రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఇసుక కొరత - దాని వల్ల భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టడమే లక్ష్యంగా నాగబాబు మైకందుకున్నారు. దీనిపై తనదైన ఫ్లోలో మాట్లాడుకుంటూ పోయిన నాగబాబు... తమ నిరసనకు మద్దతు ఇచ్చిన టీడీపీపైనా సెటైర్లు గుప్పించారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఒక్క వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే లేదని - గడచిన టీడీపీ హయాంలో కూడా ఉందన్న కోణంలో నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇసుక కొరతపై వైసీపీ - టీడీపీ ప్రభుత్వాల మధ్య పోలిక పెట్టేసిన నాగబాబు... దానిని వివరించేందుకు ఓ పిట్ట కథను కూడా చెప్పుకొచ్చారు. ఈ పిట్టకథలో తండ్రీకొడుకుల కథను చెప్పిన నాగబాబు... తండ్రిని టీడీపీ ప్రభుత్వంగా - కొడుకును వైసీపీ ప్రభుత్వంగా అభివర్ణించారు. అంతేకాకుండా కథలో తండ్రీకొడుకులు చేసిన ఘనకార్యాలను వివరించిన నాగబాబు.. కథకు ముగింపు పలికుతూ కొడుకు కంటే తండ్రి నయం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంటే... లాంగ్ మార్చ్ కు మద్దతు ఇచ్చిన టీడీపీ కూడా ఇసుక పాపంతో తడిసిపోయిందేనని నాగబాబు రూలింగ్ ఇచ్చేశారన్న మాట.
నాగబాబు ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ కనిపించిన అయ్యన్న... నాగబాబు తన కథలో తండ్రి కూడా తప్పు చేశారని చెప్పడంతో షాక్ తిన్నారు. అయితే కొడుకు చేసిన దానితో పోలిస్తే.. తండ్రి కాస్తంత బెటర్ అని, అయితే తండ్రి కూడా పవిత్రుడేమీ కాదని నాగబాబు చెప్పడంతో టీడీపీ కూడా ఇసుక పాపంతో తడిసినదేనని చాలా క్లారిటీగానే చెప్పేశారు. ఇలా ముందూ వెనుకా చూసుకోకుండా లాంగ్ మార్చ్ కు మద్దతు పలకడంతో పాటుగా ఏకంగా నిరసన ర్యాలీలో స్వయంగా పాలుపంచుకునేందుకు వచ్చిన టీడీపీని నాగబాబు టార్గెట్ చేసిన వైనంతో అయ్యన్న షాక్ తిన్నారు. అయితే వేదిక మీద ఆసీనులై ఉన్నారు కదా... నాగబాబు తమ పార్టీని, పార్టీ విధానాలను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేసినా... లోలోపలే ఉడుక్కోవడం మినహా అయ్యన్న ఏమీ చేయలేకపోయారు. మొత్తంగా లాంగ్ మార్చ్ లో ఈ సీన్ అన్నింటికంటే కూడా హైలెట్ గా నిలిచిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.