Begin typing your search above and press return to search.
మహిళలపై వస్త్రధారణపై నాగబాబు హాట్ కామెంట్స్ వైరల్!
By: Tupaki Desk | 4 July 2022 11:30 AM GMTమెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయన మరోవైపు మెగాభిమానులను పార్టీకి దగ్గర చేర్చే పనిలోనూ చురుకుగా ఉంటున్నారు. ఇంకోవైపు టీవీ షోల్లోనూ తళుక్కున మెరుస్తున్నారు.
కాగా మహిళల వస్త్రధారణపై నాగబాబు చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. గతంలోనూ అంటే 2019లో మహిళల వస్త్రధారణపై నాగబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలనేది వాళ్లిష్టమని.. వారి బట్టల గురించిన చర్చ అసంబద్ధమని నాగబాబు అప్పట్లోనే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి యాంకర్, సినీ నటి అనసూయ వంటి వారు మద్దతు కూడా పలికారు. అప్పట్లో ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ నాగబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
భారతీయ సాంప్రదాయాలను గౌరవించడం మన బాధ్యత అని.. సినిమా వేడుకల్లో హీరోయిన్స్ మితిమీరి అంగాంగ ప్రదర్శన చేస్తున్నారని అప్పట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మండిపడ్డారు. ఏదైనా సభకు వచ్చేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలా తెలియదా.. అంగాంగ ప్రదర్శన చేస్తేనే హీరోలు, నిర్మాతలు అవకాశాలు ఇస్తారని అనుకునే పరిస్థితికి హీరోయిన్లు దిగజారిపోయారు. ఈ విషయంలో తనపై కోప్పడినా ఇబ్బంది లేదని.. తాను చెప్పాల్సిన విషయాన్ని గట్టిగా చెప్పాలనుకుంటున్నానంటూ నాడు గాయకుడు బాలసుబ్రహ్మణ్యం తన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
బాలసుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై నాగబాబు కౌంటర్ ఇస్తూ ఆయనపై ఫైర్ అయ్యారు. 'వాళ్లు విప్పుతుంటే నిన్నెవడు చూడమన్నాడయ్యా.. ఆ అమ్మాయి తొడలు కనిపిస్తున్నాయ్.. బొడ్డు కనిపిస్తుంది.. మీ దృష్టి అక్కడకు ఎందుకు వెళ్తుంది? ఫస్ట్ మీ వక్రబుద్ధి మార్చుకోండి సార్.. మీ నీచమైన చూపు నుండి బయటపడండి' అంటూ అప్పట్లో నాగబాబు.. బాలు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
మళ్లీ మహిళల వస్త్రధారణపై జనసేన పార్టీ వీర మహిళలతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.. నాగబాబు. ప్రస్తుతం జనసేన వీర మహిళలకు గుంటూరు జిల్లా మంగళగిరిలో శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన నాగబాబు అసలు ఆడాళ్ల వస్త్రధారణ మాట్లాడే హక్కు మగాళ్లకి లేదంటూ ఈ విషయంలో తన మద్దతు ఎప్పుడూ మహిళలకేనని చెప్పారు.
రెండేళ్ల క్రితం ఓ ఇద్దరు ప్రముఖులు ఆడాళ్ల వస్త్ర ధారణ ఎలా ఉండాలన్న దానిపై మాట్లాడారు. ఆడాళ్లు ఎలా బిహేవ్ చేయాలి.. వస్త్ర ధారణ ఎలా ఉండాలో వీళ్లు చెప్పారని.. దానికి తాను గట్టిగానే కౌంటర్ ఇచ్చానని తెలిపారు.
తాను ఎక్కువగా అమ్మ, చెల్లెళ్లతోనే ఎక్కువ పెరిగానని చెప్పారు. అందుకే తాను వాళ్లకి ఎప్పుడు సపోర్ట్ చేస్తా.. మగాళ్లకంటే తాను ఆడవాళ్లకే ప్రిఫరెన్స్ ఇస్తా.. తన ఇంట్లో కూడా అబ్బాయికంటే అమ్మాయికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానన్నారు. నాకు తెలిసినంత వరకూ ఏ స్త్రీ కూడా.. మగాడు ఇలా ఉండాలి.. ఇలాంటి బట్టలు వేసుకోవాలి అని ఎప్పుడూ చెప్పదు. కానీ మగాడు ఎందుకు కండిషన్స్ పెడుతున్నాడు? ఇలా ఎందుకు చెప్తున్నాడో నాకు అర్ధం కావడం లేదని నాగబాబు అన్నారు.
ప్రవచనాలు చెప్పే గొప్ప వ్యక్తులు కూడా ఆడాళ్ల వస్త్రధారణపై కామెంట్స్ చేశారు.. వాళ్లని నేను ఒక్కటే అడిగా.. అసలు అమ్మాయి బట్టల్ని ఎందుకు చూశావ్.. చూస్తే ముఖం చూడాలి.. లేదంటే కాళ్లు చూడాలి.. అలా కాకుండా కిందనుంచి పై వరకూ చూడాల్సిన అవసరం మీకెందుకు వచ్చిందని అడిగానని నాగబాబు గుర్తు చేశారు.
రామయణంలో సీతాదేవిని రావణాసురుడు తీసుకుని వెళ్లిపోతుంటే.. సీతాదేవి నగలు వదిలివెళ్లిపోతుంది. లక్ష్మణుడు ఆమె నడుముకి పెట్టుకున్న వడ్డానం, ఇతర ఆభరణాలను గుర్తుపట్టడు. కానీ సీతా దేవి కాలికి వేసుకున్న కడియం చూపిస్తే లక్ష్మణుడు వెంటనే గుర్తుపడతాడు. అదేంట్రా.. మెడలో వేసుకున్న నగలు.. నడుముకు పెట్టుకున్న వడ్డానం చూడలేదా అంటే.. లేదు.. నేను ఎప్పుడూ ఆవిడ కాళ్లవైపే చూశాను అని అంటాడు. మగవాడు అలా ఉండాలి. ప్రవచనాలు చెప్పేవాళ్లు ఇలాంటివి చెప్పాలి కానీ.. ఆడాళ్ల బట్టలు ఎలా వేసుకోవాలి ఎలా చెప్తారని నాగబాబు నిలదీశారు.