Begin typing your search above and press return to search.
కెరీర్ గ్రాఫ్ డౌన్ లో ఉండగా రిటైర్మెంటా?
By: Tupaki Desk | 12 Jan 2018 7:35 AM GMTసాధారణంగా ఎవరైనా సరే.. ఏ రంగంలో ఉన్న వారైనా సరే.. తమ కెరీర్ గ్రాఫ్ పీక్స్ లో ఉన్న సమయంలోనే.. మంచి ముహూర్తం చూసుకుని రిటైరైపోవాలని అనుకుంటారు. తమను ఆ రకంగానే తమ వారందరూ గుర్తుంచుకోవాలని కోరుకుంటారు. అలాంటిది కెరీర్ లో పెద్దగా సాధించింది ఏమీ లేకపోగా.. కెరీర్ గ్రాఫ్ చాలా స్తబ్ధంగా.. డౌన్ ట్రెండ్ లో ఉన్న సమయంలో రిటైరైపోవాలని ఎవరు అనుకుంటారు? మిగిలిన రంగాల్లో సంగతి ఏమో గానీ.. రాజకీయాల్లో తెలంగాణ లోని సీనియర్ నాయకుడు ఇలాంటి ఝలక్ ఇస్తున్నారు.
తెలంగాణలో నాగం జనార్దనరెడ్డి అంటే తెలియని వారుండరు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఒక వెలుగు వెలిగిన నాగం జనార్దనరెడ్డి వైభవం ఆ తర్వాత క్రమంగా మసకబారుతూ వచ్చింది. తెలంగాణ ఉద్యమం జోరుగా ఉన్న సమయంలో అటు తెలుగుదేశంలో ఉండలేక.. ఇటు కేసీఆర్ పంచన చేరలేక సొంత పార్టీ పెట్టుకున్న నాగం జనార్దనరెడ్డి.. ఆ తర్వాత ఆ పార్టీని రద్దుచేసి భాజపాలో చేరిపోయారు.
పార్టీలో చేరారే తప్ప.. అక్కడ ఆయనకు దక్కిందంటూ ఏమీ లేదు. పార్టీలో నాయకుడిగా, తన సీనియారిటీకి సరైన గుర్తింపు కూడా లభించలేదు. భాజపాలో తొలినుంచి ఆయన అసంతృప్తితోనే వేగిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఉగాది తర్వాత.. పార్టీని వీడబోతున్నానని.. ఏ పార్టీలోకి వెళ్లేది తర్వాత చెబుతానని నాగం అంటున్న సంగతికూడా మనకు తెలుసు.
అయితే కెరీర్ ఇంతగా మసకబారి ఉన్న సమయంలోనే నాగం.. తన రాజకీయ రిటైర్మెంట్ గురించి కూడా ప్రకటించేశారు. 2019లో తాను పోటీ చేయబోయే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని కూడా ఆయన ప్రకటించేశారు. అంటే 2019 తర్వాత ఆయన రాజకీయాలనుంచి విరమించుకుంటా రన్నమాట. అయితే ఇంత త్వరగా రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించేయడం.. పైగా గత పదిహేనేళ్లుగా ఎలాంటి పదవీ వైభోగం లేకుండా స్తబ్ధుగా ఉన్న సమయంలో రిటైర్మెంట్ ప్రకటన చేయడం ఆశ్చర్యకరంగా ఉన్నదని నాగం సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.