Begin typing your search above and press return to search.
టీ మంత్రులు పాపం.. మూగజీవాలంట
By: Tupaki Desk | 25 Aug 2015 1:31 PM GMTనాగం ఈజ్ బ్యాక్ అన్నట్లుగా ఉంది ఆయన వ్యవహారం. తనలో జోరు తగ్గలేదని..తనకు తగ్గ వేదిక ఉండాలే కానీ తన సత్తా ఏమిటో చూపిస్తానన్నట్లుగా ఉంది తెలంగాణ సీనియర్ నేత నాగం జనార్దనరెడ్డి వ్యవహారం. పేరుకు బీజేపీలో కొనసాగుతున్నా.. పోరు తెలంగాణ పేరిట ఉద్యమ సంస్థను ఏర్పాటు చేసి.. తనదైన శైలిలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు.. ఆందోళనలు.. పర్యటనలు చేపట్టాలని నిర్ణయించటం తెలిసిందే. గత కొద్దికాలంగా కామ్ గా ఉన్న ఆయన.. గత రెండు వారాలుగా స్పీడ్ పెంచేశారు.
తాజాగా తెలంగాణ మంత్రులను ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రులు.. పాపం మూగజీవాలంటూ జాలిపడ్డ ఆయన.. ఈ మధ్య మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యను ప్రస్తావించి ఫైర్ అయ్యారు. ప్రశ్నిస్తే జైల్లో పెడతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారని.. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. మంత్రులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించిన ఆయన.. బుధవారం నుంచి రైతు భరోసా యాత్రను చేపట్టనున్నట్లు వెల్లడించారు.
మంత్రులు డమ్మీలుగా మారిపోయారని.. ఇక.. ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ వాదులంతా సిగ్గు పడుతున్నారంటూ మండిపడ్డారు. దేశంలోని ముఖ్యమంత్రులంతా పాలన మీద దృష్టి పెడుతుంటే.. కేసీఆర్ మాత్రం పాలనను గాలికి వదిలేశారంటూ ఫైర్ అయిన నాగం తీరు చూస్తుంటే.. ఇక.. తరచూ తెలంగాణ సర్కారుపై విరుచుకుపడే మరోనేత తెరపైకి వచ్చినట్లేనని చెప్పక తప్పదు.